జియోఫోన్‌కు పోటీగా జోల్లా 4జీ ఫోన్
ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ‘జోల్లా' (Jolla) .. సెయిల్ ఫిష్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన తన రెండవ హ్యాండ్‌సెట్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది.
ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ 'జోల్లా' (Jolla) .. సెయిల్ ఫిష్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన తన రెండవ హ్యాండ్‌సెట్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. 4జీ ఫీచర్ ఫోన్‌ల కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడిన Sailfish 3 ఆపరేటింగ్ సిస్టంను ఎండబ్ల్యూసీ 2018లో భాగంగా జోల్లా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు సెయిల్ ఫిష్ 3 ప్లాట్‌ఫామ్‌ను సెయిల్‌ఫిష్ ఎక్స్ పేరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ చేసిన ఓ కధనం ప్రకారం... తమకీ ఫీచర్ ఫోన్ ఆలోచన భారత్‌కు చెందిన ఓ కస్టమర్ కేస్ ద్వారా వచ్చిందని జోల్లా సీఈఓ సామీ పెనిమాకి తెలిపారు. తాము లాంచ్ చేయబోతన్న 4జీ ఆధారిత ఫీచర్ ఫోన్ జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ప్రధాన కాంపిటీటర్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు.

తాజా మీడియా రిపోర్ట్స్ ప్రకారం భారత్‌లో ఫీచర్ ఫోన్‌ల వినియోగం గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యింది. గతే 18 నుంచి 19 మిలియన్లగా ఉన్న ఫీచర్ ఫోన్ షిప్‌మెంట్స్ ఈ ఏడాది ఏకంగా 40 మిలియన్లకు పెరిగినట్లు తెలుస్తోంది. 4జీ కనెక్టువిటీతో విడుదలైన మొట్టమొదటి ఫీచర్ ఫోన్‌గా జియోఫోన్ గుర్తింపు తెచ్చుకోవటంతో ఈ డివైస్‌కు నెటిజనులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా ఈ ఫోన్ కోసం జియో పరిచయం చేసిన రూ.49 ప్లాన్‌కు యూజర్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఇదే సమయంలో జియోఫోన్‌లకు ధీటుగా నోకియా ఫీచర్ ఫోన్‌లు కూడా అమ్ముడవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ ప్రకారం నోకియా ఫీచర్ ఫోన్‌ల విక్రయాల సంఖ్య 20.7 మిలియన్లకు పెరిగినట్లు తెలుస్తోంది. 2017 చివరి త్రైమాసికానికి గాను సామ్‌సంగ్ ఫీచర్ ఫోన్ మార్కెట్ షేర్ 15 శాతంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.
మైక్రోమాక్స్, ఐటెల్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు కూడా ఫీచర్ ఫోన్ మార్కెట్లో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. KaiOS పై రన్ అవుతోన్న జియోఫోన్.. ఫేస్‌బుక్, గూగుల్ అసిస్టెంట్ వంటి ముఖ్యమైన యాప్‌లను సపోర్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ను కూడా సపోర్ట్ చేయబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications