'జోష్' వస్తోంది, ఇక అందరికీ 'దడ'..

Posted By: Super

'జోష్' వస్తోంది, ఇక అందరికీ 'దడ'..

గత పది సంవత్సరాల క్రితం మొబైల్ అంటే నోకియా అనే వారు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత రోజుల్లో జనాభా అభిప్రాయాలు మారి కొత్త కొత్త బ్రాండ్స్‌కి అలవాటు పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టకొని ఇండియాలో కొత్త కొత్త మొబైల్ తయారీదారులు విజృంభించారు. ముఖ్యంగా ఇండియాలో మనం చూసుకున్నట్లైతే జపాన్, కొరియా, యూరప్, యుఎస్ దేశాలకు చెందిన మొబైల్స్ ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి కొత్త మొబైల్ తయారీదారు జోష్ మొబైల్స్ రానుంది.

జోష్ మొబైల్స్ ఇండియాలో ఉన్న మద్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకోని మొబైల్స్‌ని మార్కెట్లో విడుదల చేయనుంది. బేసిక్ మొడల్స్ అయిన ఎమ్‌పి3, ఎఫ్‌ఎమ్ రేడియో ఫీచర్స్ తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. జోష్ మొబైల్స్ మార్కెట్లోకి జోష్ జెబి 289 అనే డ్యూయల్ సిమ్ మోడల్‌ని విడుదల చేయనుంది. జోష్ జెబి 289 మొబైల్‌ బేసిక్ మోడల్‌లో ఏమేమి ఫీచర్స్ ఉండాలని కొరుకుంటారో అవన్నీ ఫీచర్స్‌తో మార్కెట్లోకి రానుంది.

మార్కెట్లో లభించే MIDI, MP3, AMR లాంటి ఆడియో ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుంది. 1.3 మెగా ఫిక్సల్ కెమెరా ఉండడం వల్ల చూడచక్కని ఇమేజిలను తీయవచ్చు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 2 ఇంచ్‌గా రూపొందించబడింది. ఇందులో ఉన్న బ్యాటరీ 5 గంటలు టాక్ టైమ్‌ నిస్తుందని అంటున్నారు. జోష్ జెబి 289 మొబైల్‌ ప్రత్యేకతలను క్లుప్తంగా....

జోష్ జెబి 289 మొబైల్‌ ధర, ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Josh
మోడల్: JB289
ఫామ్ ప్యాక్టర్: Bar
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 Mhz | GSM 900 / 1800 Mhz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే సైజు: Large 2.0 inches, TFT LCD Display Colors

కెమెరా
కెమెరా: Yes, 1.3 Mega Pixels Camera
కెమెరా రిజల్యూషన్: 1280 x 1024 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes, Video Formats : MP4, 3GP

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes, Java Games
జావా: Yes
బ్రౌజర్: Yes, WAP Browser

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 240 hours
టాక్ టైమ్: Up to 4-6 hours
Li-ion: 1800 mAH

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: Yes
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 4GB
మొమొరీ స్లాట్: Yes, T-Flash Card

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, MP3, Polyphonic
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, Wireless FM Radio
మ్యూజిక్: Yes, Music Formats : MP3, MIDI, AMR with Stereo Earphone

మొబైల్‌ కలర్: Blue/Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot