సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌తో ‘ఎంఎక్స్100 లీడర్’

Posted By:

గ్రామీణ ప్రాంత ప్రజల కోసం మ్యాక్స్ మొబైల్ సంస్థ సరికొత్త ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఎంఎక్స్100 లీడర్ ' మోడల్‌లో అందుబాటులోకి రానున్న ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన 4,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంది. తద్వారా ఫోన్ ఛార్జింగ్ 3 నుంచి 4 రోజుల పాటు నిలకడగా ఉంటుంది. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.1,932.

 సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌తో ‘ఎంఎక్స్100 లీడర్’

గురువారం కొత్త ఢిల్లీలోని విగ్యాన్ భవన్‌లో నిర్వహించిన టెలికామ్ ఎగ్జిబిషన్ 13లో భాగంగా యూనియన్ కమ్యూనికేషన్ ఇంకా ఐటీ శాఖా మంత్రి కపిల్ సిబాల్ ఇంకా రాష్ట్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖా మంత్రులు మిలిండ్ డియోరా, కిల్లీ కృపారాణీలు ఎంఎక్స్100 ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించారు.

గ్రామీణ ప్రాంత ప్రజలను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఫీచర్ ఫోన్ ‘మ్యాక్స్ ఎంఎక్స్100' ఉపయోగకర ఫీచర్లను కలిగి ఉంది. వాటిని పరిశీలించినట్లయితే:

ధృడమైన డిజైనింగ్,

శక్తివంతమైన 4400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఎల్ఈడి టార్చ్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
డిజిటల్ కెమెరా,
బ్లూటూత్, ఎంపీ3, ఎంపీ4 ప్లేయర్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,ఎఫ్ఎమ్ రేడియో, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ.
ఫోన్ ధర రూ.1,932.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot