ఉన్నత ప్రమాణాలతో కార్బన్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్

Posted By: Prashanth

 

ఉన్నత ప్రమాణాలతో కార్బన్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్

 

స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చిన కార్బన్ ఇతర దేశీ బ్రాండ్‌లైన స్పైస్, మైక్రోమ్యాక్స్‌లకు గట్టిపోటినిస్తూ దూసుకుపోతోంది. ఈ దేశవాళీ బ్రాండ్ తయారుచేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు మోటరోలా, సోనీ, ఎల్జీ వంటి దిగ్గజశ్రేణి కంపెనీలకు సవాల్‌గా నిలవటం విశేషం. తాజాగా సంస్థ విడదుల చేసిన డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్ ‘కార్బన్ స్మార్ట్ ఏ18’ ఉన్నత శ్రేణి ఫీచర్లతో డిజైన్ కాబడండి. ఈ హ్యాండ్‌సెట్ విక్రయాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఫీచర్లు విషయానికొస్తే..

4.3 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 480 x 800పిక్సల్స్),

డ్యూయల్ సిమ్,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెర్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

1జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్),

1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియ్ చాటింగ్ నిర్వహించుకునేందుకు),

వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్, 3జీ, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,

1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5 గంటలు, స్టాండ్ బై 200 గంటలు).

ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (ఫేస్‌బుక్, వాట్స్ అప్, కార్బన్ స్మార్ట్ బ్రౌజర్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, నెక్స్ జీటీవీ, పే టీఎమ్),

ధర రూ.9,790.

కార్బన్ ట్రిపుల్ సిమ్ ఫోన్ కేసీ 999 ఫీచర్లు:

ట్రిపుల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్+సీడీఏమ్ఏ), 1.3 మెగా పిక్సల్ కెమెరా, 1.8 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్, జీపీఆర్ఎస్, ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ 4జీబి, శక్తివంతమైన 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.2,955.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot