ఇంటి పోరు... కార్బన్ x మైక్రోమ్యాక్స్!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లతో కళకళలాడుతోంది. దేశీవాళీ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్, కార్బన్‌లు పోటాపోటీగా స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా ఈ బ్రాండ్‌ల నుంచి ప్రకటించబడిన ‘మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్’, ‘కార్బన్ ఏ21’స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో వాడివేడి వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ నేపధ్యంలో వీటి స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.....
బరువు ఇంకా చుట్టుకొలత......
కార్బన్ ఏ21: వివరాలు తెలియాల్సి ఉంది.
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 127.2 x 66.8 x 9.8మిల్లీ మీటర్లు, బరువు 118 గ్రాములు,
డిస్‌ప్లే......
కార్బన్ ఏ21: 4.5 అంగుళాల మల్టీటచ్ కెపాసిటవ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 4.5 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ప్రాసెసర్.......
కార్బన్ ఏ21: 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం.....
కార్బన్ ఏ21: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా.....
కార్బన్ ఏ21: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకనేందుకు),
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఆటోఫోకస్, ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు.
స్టోరేజ్.......
కార్బన్ ఏ21: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ......
కార్బన్ ఏ21: 3జీ, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై ఫీచర్,
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 3జీ, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై ఫీచర్,
బ్యాటరీ......
కార్బన్ ఏ21: 1800ఎమ్ఏమెచ్ లియోన్ బ్యాటరీ(5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై),
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 1600ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ ( టాక్‌టైమ్ 5 గంటలు, స్టాండ్‌బై 174 గంటలు),
ధర.......
కార్బన్ ఏ21: రూ.11,990.
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: రూ.12,990.
ప్రీలోడెడ్ అప్లికేషన్స్.......
కార్బన్ ఏ21: ఫేస్‌బుక్, వాట్స్ అప్, కార్బన్ స్మార్ట్ బ్రౌజర్, కింగ్ సాఫ్ట్ ఆఫీస్, నెక్స్ జీటీవీ, పేటీఎమ్.
మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: ఫేస్‌బుక్, గూగుల్ ప్లే స్టోర్, మైక్రోమ్యాక్స్ హుక్ అప్ అప్లికేషన్,
తీర్పు.......
వేగవంతమైన ప్రాసెసర్, పెద్దదైన డిస్‌ప్లే, ఉత్తమ క్వాలిటీ ఫ్రంట్ కెమెరా ఇంకా తక్కువ ధరను కోరుకునే వారికి కార్బన్ ఏ21 ఉత్తమ ఎంపిక. మరో వైపు, అత్యుత్తమ కెమెరా ఇంకా ఉత్తమ క్వాలిటీ టెక్ స్పందనలను కోరుకునే వారికి మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ బెస్ట్ చాయిస్.


Click it and Unblock the Notifications