కార్బన్ ఏ30.. (డ్యూయల్ సిమ్, 5.9 అంగుళాల స్ర్కీన్)!

Posted By: Prashanth

కార్బన్ ఏ30.. (డ్యూయల్ సిమ్, 5.9 అంగుళాల స్ర్కీన్)!

 

సామ్‌సంగ్, హవాయి వంటి అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్‌లు 6 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌ల పై దృష్టిసారిస్తున్న నేపధ్యంలో దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ కార్బన్ మొబైల్స్, 5.9 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లో సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. మోడల్... ‘కార్బన్ ఏ30’. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్‌కామ్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్‌ను రూ.10,990 ధరకు లిస్టింగ్స్‌లో పేర్కొంది. కార్బన్ ఏ30ను అధికారికంగా డిసెంబర్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే........

జేమ్స్‌బాండ్ హాట్ హాట్ కలెక్షన్ (ఫోటో గ్యాలరీ)!

5.9 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‍క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

డ్యూయల్ సిమ్ సపోర్ట్,

వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్,

2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.10,900 (హ్యాండ్‌సెట్ ధర వివరాలను కార్బన్ మొబైల్స్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది).

ఏలా హింసించారో మీరే చూడండి.. (వీడియో)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot