కార్బన్ ఏ7 vs మైక్రోమ్యక్స్ ఏ87... ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్?

Posted By: Staff

 

దేశీయంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్  నెలకుంది.  ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించాయి.

ఈ క్రమంలో వీటి నుంచి విడుదలైన

‘కార్బన్ ఏ7+’, ‘మైక్రోమ్యక్స్ ఏ87’ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. ఈ గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి విశ్లేషణ...

చుట్టుకొలత ఇంకా డిస్‌ప్లే:

కార్బన్ ఏ7+: శరీర పరిమాణం వివరాలు తెలియాల్సి ఉంది, 3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ హెచ్‌వీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),

మైక్రోమ్యక్స్ ఏ87: శరీర పరిమాణం 124.8 x 64 x 11.7మిల్లీమీటర్లు, 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్:

కార్బన్ ఏ7+: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

మైక్రోమ్యక్స్ ఏ87: 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

కార్బన్ ఏ7+: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

మైక్రోమ్యక్స్ ఏ87:  ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

కార్బన్ ఏ7+: 5మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్), వీడియో కెమెరా (వీడియో కాలింగ్),

మైక్రోమ్యక్స్ ఏ87: 2మెగా పిక్సల్ రేర్ కెమెరా,

స్టోరేజ్:

కార్బన్ ఏ7+: 512 ఎంబీ ర్యామ్, 157 ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత

మైక్రోమ్యక్స్ ఏ87: మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

కార్బన్ ఏ7+: వై-పై, బ్లూటూత్, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్,

మైక్రోమ్యక్స్ ఏ87: వై-ఫై, బ్లూటూత్, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్,

బ్యాటరీ:

కార్బన్ ఏ7+: 1420ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

మైక్రోమ్యక్స్ ఏ87: 1400ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర:

కార్బన్ ఏ7+: రూ.6,990,

మైక్రోమ్యక్స్ ఏ87: రూ.5,999.

తీర్పు:

ఇంచుమించు సమాన స్పెసిఫికేషన్‌‌లతో డిజైన్ కాబడిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ధరల విషయంలో భిన్నంగా  ఉన్నాయి. కార్బన్ ఏ7+,  జీ- సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, ఎంఎంఎస్, హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్, వాయిస్ అసిస్టెడ్ జీపీఎస్ నావిగేషన్ ఫీచర్లను కలిగి ఉంది. మరో వైపు  మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా4, అయిషా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌‌ను ఒదిగి ఉంది. బెటర్ కెమెరా ఆప్షన్‌ను కొరుకునే వారికి కార్బన్ ఏ7+ సరియైన  ఎంపిక. తక్కువ ధర, పెద్దదైన డిస్‌ప్లే అనుభూతులను కోరుకునే వారికి మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా4 బెస్ట్ చాయిస్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot