మైక్రోమ్యాక్స్ స్పీడుకు కార్బన్ బ్రేకులు..?

Posted By: Prashanth

Karbonn A9+ and A21 Dual SIM Android ICS Smartphones

 

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశీయ బ్రాండ్‌ల హవా స్ఫష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా కార్బన్ ఎడతెరపిలేని కొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను హోరెత్తిస్తోంది. తన పాత వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లైన కార్బన్ ఏ1, ఏ7లకు అప్‌గ్రేడెడ్ వర్షన్‌లుగా ఏ1+, ఏ7+ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఈ నెల ఆరంభంలోనే విడుదల చేసింది. మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘కార్బన్ ఏ11’ వివరాలను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిపికార్డ్ ఇప్పటికే తన లిస్టింగ్‌లో పేర్కొంది. ధర రూ.8,499. త్వరలోనే ఈ ఫోన్ అందుబాటలోకి రానుంది. తాజాగా మైక్రోమ్యాక్స్ తన పాత వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఏ9కు సక్సెసర్‌గా కార్బన్ ఏ9+ను విడుదల చేసింది. మరో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ కార్బన్ ఏ21 మార్కెట్లో ప్రత్యక్షమైంది. కార్బన్ ఏ9+, కార్బన్ ఏ21 లకు సంబంధించి కీలక స్సెసిఫికేషను ఇప్పుడు చూద్దాం....

కార్బన్ ఏ9+(డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్):

డిస్‌ప్లే: 4 అంగుళాల మల్టీ‌టచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్,

కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మెమరీ: ఇంటర్నల్ స్టోరేజ్ అదేవిధంగా ర్యామ్ వివరాలు తెలియాల్సి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

కనెక్టువిటీ: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,

బ్యాటరీ: 1420ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర : ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈ ఫోన్ ధరను రూ.9,200గా ప్రకటించింది.

లింక్ అడ్రస్

కార్బన్ ఏ21:

డిస్‌ప్లే: 4.5 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్: 1.2గిగిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మెమెరీ: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, వై-ఫై, వై-పై హాట్ స్పాట్,

బ్యాటరీ: 1800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5 గంటల టాక్‌ టైమ్, 200 గంటల స్టాండ్ బై),

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్, కార్బన్ ఏ21 ధరను రూ.10,490గా ప్రకటించింది.

లింక్ అడ్రస్

మైక్రోమ్యాక్స్ పై ప్రభావం ఎంత..?

స్మార్ట్‌ఫోన్ విభాగంలో దేశీయంగా రెండో స్థానం పై గురి పెట్టిన మైక్రోమ్యాక్స్ ఆ దిశగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల కాలంలో సూపర్ ఫోన్ ఏ57 నింజా3, సూపర్ ఫోన్ ఏ87 నింజా 4, సూపర్ ఫోన్ ఏ84 ఎలైట్, పిక్సల్ ఏ90, కాన్వాస్ ఏ100 మోడళ్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. తాజాగా విడుదలైన కార్బన్ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పట్ల పాజిటివ్ టాక్ రావటంతో, ఈ ప్రభావం మైక్రోమ్యాక్స్ అమ్మకాల పై చూపే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot