కార్బన్ ఢబుల్ ధమాకా మొబైల్స్...

Posted By: Super

కార్బన్ ఢబుల్ ధమాకా మొబైల్స్...

కొత్త జనరేషన్‌ మొబైల్ ఫోన్స్‌తో పాటు క్వాలిటీ కలిగిన ఫీచర్స్ అందించే మొబైల్ పోన్స్‌‌గా ఇప్పటికే మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న ఇండియన్ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ త్వరలో మరో కొత్త మోడల్స్‌ని ఇండియన్ కస్టమర్స్ కోసం ప్రవేశపెట్టనున్నాయి. కార్బన్ మొబైల్ మొబైల్స్ డ్యూయల్ సిమ్ సెగ్మెంట్లో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాయి. త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న మొబైల్స్ కార్బన్ కెడి 100, కార్బన్ కె1515.

కార్బన్ మొబైల్స్ ఈ రెండు మొబైల్ ఫోన్స్‌కి సంబంధించిన విడుదలను అధికారకంగా ప్రకటించడమే కాకుండా రెండు మొబైల్స్‌ని కూడా డ్యూయల్ సిమ్ కేటగిరిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. కార్బన్ కెడి 100ని కార్బన్ మొబైల్స్ గతంలో విడుదల చేసిన డిస్నీ సిరిస్ మొబైల్ ఫోన్‌ పరగణించింది. ఇక కార్బన్ కె1515 మాత్రం 3డి యూజర్ ఇంటర్ ఫేస్‌తో రూపోందించబడింది. రెండు మొబైల్స్‌ని గనుక పరీక్షించి చూసినట్లైతే రెండింటిలోను ఒకే విధమైన ఫీచర్స్, కొన్ని తేడాలను కూడా గమనించవచ్చు. కార్బన్ కెడి 100 మొబైల్ 2.0 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు 170 x 220 స్క్రీన్ రిజల్యూషన్‌ని కలిగి ఉంటుంది.

అదే కార్బన్ కె 1515 మాత్రం 3.2 ఇంచ్ HVGA టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. ఇక కార్బన్ కె1515 మొబైల్ తోపాటు 1జిబి మొమొరీ లభించగా, మొమొరీని మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 8జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. అదే కార్బన్ కెడి100లో మొమొరీని 16జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే రెండు మొబైల్స్‌లలోను ఒకే విధమైన సారుప్యత ఉంది. అదేంటంటే రెండు మొబైల్స్ లలోను బ్యాటరీ బ్యాక్ అప్ 6 నుండి 8 గంటలు వరకు వస్తుంది. వీటితోపాటు రెండు మొబైల్స్ లలోను ఉన్నకెమెరా 2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. ఎఫ్ ఎమ్ రేడియో, మ్యూజిక్ ప్లేయర్, బ్లూటూత్ లాంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ని కూడా కలిగి ఉన్నాయి.

ఈ రెండు మొబైల్స్‌లలో ఉన్న మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇందులో మొబైల్ ట్రాకర్ ఉంది. దీనివల్ల ఎవరైనా మీ మొబైల్‌ని గనుక దొంగిలించినట్లైతే వారిని పట్టుకోవడం చాలా ఈజీ. కార్బన్ మొబైల్స్ ఈ రెండు మొబైల్స్‌ని విడుదల చేయడం వల్ల డ్యూయల్ సిమ్ మార్కెట్లో తన సత్తా చాటనుంది. యూజర్స్ యొక్క ఛాయిస్‌ని బట్టి ఎవరెవరికి ఏయే మొబైల్ తీసుకుంటారనేది ఆధారపడి ఉంటుంది. అందుకు కారణం రెండు మొబైల్స్ కూడా డ్యూయల్ సిమ్ మొబైల్సే కాబట్టి. కార్బన్ కెడి 100 మొబైల్ ధర మార్కెట్లో సుమారుగా రూ 5,000 వరకు ఉండవచ్చునని అంచనా. అదే కార్బన్ కె 1515 ధర మాత్రం సుమారుగా రూ 7,500గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot