మా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది ఇక కాస్కోండి

Posted By: Staff

మా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది ఇక కాస్కోండి

7 లేదా 8 సంవత్సరాల క్రితం ఇండియన్ మొబైల్ మార్కెట్‌ని కేవలం రెండు లేదా మూడు మొబైల్ కంపెనీ(నోకియా, సోనీ ఎరిక్సన్, శ్యామ్ సంగ్)లు మాత్రమే శాసించేవి. ఆ తర్వాత కాలంలో విదేశీ మొబైల్ తయారీ దారులైన ఎల్‌జీ, హెచ్ టిసి, మోటరోలా లాంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించడంతో కాంపిటేషషన్ బాగా పెరిగిపోయింది. ఐతే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో పరిస్దితి పూర్తిగా మారిపోయింది. కేవలం విదేశీ కంపెనీలే కాకుండా స్వదేశీ కంపెనీలు అయిన కార్బన్ మొబైల్స్, మైక్రోమ్యాక్స్, మ్యాక్స్ మొబైల్స్ లాంటి కంపెనీలు కూడా హావాని సాగిస్తున్నాయి.

ఇండియా లోకల్ బ్రాండ్ కార్బన్ మొబైల్స్ కూడా ఏదో కొత్తో గొప్పో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇండియాలో ఉన్న మొబైల్స్ కంపెనీలతో పోల్చితే కార్బ న్ మొబైల్స్ కూడా పెద్ద మొబైల్ కంపెనీగా అవతరించింది. మొబైల్స్ ఫోన్స్‌ని కస్టమర్స్ దగ్గరకు చేర్చడంలో కార్బన్ మొబైల్స్ వినూత్నమైన పద్దతులను పాటించడం వల్ల కార్బన్ మొబైల్స్ యొక్క ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోవడమే కాకుండా అనుకున్నదానికంటే అత్యధిక లాభాలను గడించింది. దీనిని అనుగుణంగా తీసుకోని కంపెనీ వేసే ప్రతి అడుగులోను ఆలోచించి వేయడం మాత్రమే కాకుండా కంపెనీ బిజినెస్ స్ట్రాటజీని కూడా మార్చివేసింది.

ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రూమర్‌ని బట్టి చూస్తుంటే రాబోయే కొన్ని నెలలో ఓ ప్రయివేట్ ఈక్విటీ ప్లేయర్స్‌ని $125 మిలియన్స్‌ని వెచ్చించి స్వాదీనం చేసుకొనుందని సమాచారం. ఇలా చేయడానికి కారణం కంపెనీ తన కార్యక్రమాలను దిశదశలా విస్తరించడానికేనని తెలిపారు. వీటితో పాటు త్వరలో బెంగళూరు, న్యూఢిల్లీలో కంపెనీకి చెందిన రీసెర్చ్ సెంటర్స్‌ని నెలకొల్పడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లోకి త్వరలో కార్బన్ మొబైల్స్ నుండి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనున్నామని తెలిపిన విషయం తెలిసిందే.

ఆండ్రాయిడ్ ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన స్మార్ట్ ఫోన్‌ని అతి తక్కువ ధరలో కేవలం రూ 6999కే విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్ అతి తక్కువ ధరకు లభింపచేసే కంపెనీగా కార్బన్ మొబైల్స్ రికార్డుని నమోదు చేయనుంది. ఇది మాత్రమే కాకుండా ఇండియా తయారీదారైన కార్బన్ మొబైల్స్ ఇలా తక్కువ ధర కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని ప్రవేశపెట్టడంతో మిగతా ఇండియన్ కంపెనీలైన స్పైస్, మైక్రోమ్యాక్స్, మ్యాక్స్ మొబైల్స్ తయారీదారులు నిద్ర మేల్కోనే సమయం వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఇండియన్ మొబైల్ మార్కెట్ వాల్యూ రూ30000 కోట్లు కాగా అందులో కార్బన్ మొబైల్స్ కంపెనీ షేర్ సుమారుగా 5 % శాతం ఉంది. కొత్తగా ప్లాన్ చేసినటువంటి ఈ పధకం వల్ల ఈ సంవత్సరం దాదాపు 10మిలియన్ యూనిట్ల అమ్మకాలను నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కార్బన్ ప్రకటించిన విధానం ప్రకారం తక్కువ ధర స్మార్ట్ ఫోన్స్ ధరకు మరో మూడు మొబైల్స్‌ని కూడా విడుదల చేయనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot