Home
Mobile

రూ.7000లో బెస్ట్ ఫోన్ ఇదే, Karbonn Frames S9 రివ్యూ

దేశీయ మొబైల్ మేకర్ 'కార్బూన్ ' నుంచి మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. Karbonn Frames S9 పేరుతో దేశీయ దిగ్గజం కార్బూన్ మొబైల్ ను లాంచ్ చేసింది.

By Anil

దేశీయ మొబైల్ మేకర్ 'కార్బూన్ ' నుంచి మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. Karbonn Frames S9 పేరుతో దేశీయ దిగ్గజం కార్బూన్ మొబైల్ ను లాంచ్ చేసింది. చాలా తక్కువ ధరతో మంచి ఫీచర్స్ తో ఈ ఫోన్ వినియోగదారుల కోసం మార్కెట్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా మొబైల్ లోని కెమెరా పనితీరు చాలా బాగుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.6,790గా ఉంది. ఆకట్టుకునే సెల్పీ కెమెరాతో పాటు ఫ్లాష్ లైటుతో కూడిన సదుపాయాన్ని కంపెనీ ఈ ఫోన్లో పొందుపరిచింది. 2జిబి ర్యామ్ తో పాటు ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో వచ్చిన karbonn Frames S9 పూర్తి రివ్యూ మీకు అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఫోన్ డిజైన్ అండ్ డిస్‌ప్లే :

ఫోన్ డిజైన్ అండ్ డిస్‌ప్లే :

 Karbonn Frames S9 స్మార్ట్‌ఫోన్ యూజర్ చేతుల్లో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. లైట్ వెయిట్‌కు తోడు edge to edge కార్నర్స్ ఈ ఫోన్‌కు మంచి లుక్‌ను తీసుకువచ్చాయి. ఈ డివైస్ ప్యానెల్ నాణ్యత మరియు రంగు యావరేజ్ గానే అనిపిస్తుంది కాని బడ్జెట్ రేంజులో ఇది మంచి ఫీచరేనని చెప్పవచ్చు. 

ఈ ఫోన్‌కు ముందువైపు ఫ్లాష్ లైట్ తో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వాల్యూమ్ రాకర్స్ మరియు పవర్ కీతో పాటు మైక్రో SD కార్డ్ స్లాట్ ఫోన్ కుడి పక్కన ఉన్న పానెల్ పై భాగంలో పొందుపరిచారు. అయితే ఎడమవైపు ప్యానెల్  SIM కార్డు ట్రేను కలిగి ఉంది.

ఫోన్ పై భాగంలో 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను, మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్టును క్రింది భాగంలో పొజీషన్ చేసి ఉంచారు. ఈ ఫోన్‌లో 5.20-అంగుళాల HD IPS డిస్‌ప్లే మరియు 720 పిక్సెల్స్ x 1280 పిక్సల్స్ యొక్క స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది.

కెమెరాల విషయానికి వస్తే :

కెమెరాల విషయానికి వస్తే :

Karbonn Frames S9 లో కంపెనీ రెండు అప్‌డేటెడ్ కెమెరాలను పొందుపరిచింది. ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 8 ఎంపీ,8మెగా పిక్సల్ రేర్ కెమెరాలు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ సపోర్ట్‌తో తక్కువ వెళుతరులోనూ హై-క్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తోంది.

ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను Karbonn Frames S9 కలిగి ఉంది. బ్యూటిఫై మోడ్, పేస్ క్యూట్ మోడ్, వంటి ప్రత్యేకమైన మోడ్స్‌ను ఈ కెమెరా యాప్‌లో అందుబాటులో ఉంచారు.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్:

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్:

రూ.6,790 బడ్జెట్‌లో అందుబాటులో ఉంచిన ఈ స్మార్ట్‌ఫోన్‌కు Android Nougat 7.0 ఆపరేటింగ్ సిస్టం  ఓ హైలైట్‌గా నిలుస్తుంది. దీనికి తోడు 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ప్రాసెసింగ్ అలానే మల్టీటాస్కింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తాయి. డ్యుయల్ నానో సిమ్‌లకు తోడు ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

బ్యాటరీ :

బ్యాటరీ :

Karbonn Frames S9 ,2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఇంకో ఆసక్తికర ఫీచర్ ఏంటంటే మీరు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ నుంచి ఆండ్రాయిడ్ 8.0 ఓరియోకి అప్ డేట్ అయ్యే కావచ్చు. 

కెమెరా ప్రత్యేక ఆకర్షణ

కెమెరా ప్రత్యేక ఆకర్షణ

ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. ఫోన్ లోని కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. Karbonn Frames S9 ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫోన్ల ఫీచర్లనే కలిగిఉన్నప్పటికీ కార్బూన్ అభిమానులు, దేశీయ ఫోన్ అభిమానులు ఈ ఫోన్ మీద ఆసక్తి చూపవచ్చు.ఇదే ధరలో షియోమి, హానర్ కంపెనీలు కూడా తమ బడ్జెట్ ఫోన్లను ఆఫర్ చేస్తున్నాయి. 

Best Mobiles in India

English summary
Karbonn Frames S9 review: Low-budget smartphone with impressive wide angle front camera.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X