Home
Mobile

రూ.6,790కే డ్యూయెల్ సెల్ఫీ కెమెరా ఫోన్,రూ.3,999కే 4జీ వోల్ట్ ఫోన్

మొబైల్ దిగ్గజాలు కార్బన్, పానాసోనిక్ కంపెనీ అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేశాయి.కార్బన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్9'ను విడుదల చేయగా,పానాసోనిక్ పీ95 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది.

By Hazarath Aiah

మొబైల్ దిగ్గజాలు కార్బన్, పానాసోనిక్ కంపెనీ అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేశాయి.కార్బన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్9'ను విడుదల చేయగా, పానాసోనిక్ పీ95 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కార్బన్ స్మార్ట్‌ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్9 రూ.6,790 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎయిర్‌టెల్ రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. రూ.169 ప్లాన్‌ను 36 నెలల పాటు రీచార్జి చేసుకుని వాడితే ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో ముందు భాగంలో రెండు సెల్ఫీ కెమెరాలను అమర్చారు. వీటితో పవర్‌ఫుల్ క్వాలిటీ ఉన్న సెల్ఫీలను తీసుకోవచ్చు.

Karbonn Frames S9

కార్బన్ ఫ్రేమ్స్ ఎస్9 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ.

పానాసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'పీ95' ను విడుదల చేసింది. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.4,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో జరగనున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.1వేయి తగ్గింపు ధరకు.. అంటే.. రూ.3,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Karbonn Frames S9

పానాసోనిక్ పీ95 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Karbonn Frames S9 With Dual Selfie Cameras Launched in India: Price, Specifications More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X