భారతీయుని నేస్తం ‘కార్బన్’ కొత్త అవతారం K 600!!

కార్బన్ డ్యూయల్ సిమ్ ఫోన్లు దేశమంతంటా తమ పరిధిని పెంచుకున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు ‘కార్బన్ ఫోన్లు’ ఈ విధంగా సుపరిచితమవటానికి కారణం మన్నిక అదే విధంగా విశ్వసనీయత. తాజాగా కార్బన్ సరికొత్త ఫీచర్ల గల K 600 డ్యూయల్ సిమ్ మొబైల్ ను మార్కెట్లో విడుదల చేసింది.
స్టన్నింగ్ బ్లాక్ లుక్ లో డిజైన కాబడిన ఈ మొబైల్ వినియోగదారుడికి 24x7 రోజులు చేదోడు వాదోడుగా నిలుస్తుంది. QVGA రిసల్యూషన్ కలిగిన స్ర్కీన్, వీజీఏ క్వాలిటీ కెమెరా, ఇంటి్గ్రేటెడ్ స్పీకర్స్, ఎఫ్ఎమ్ రేడియో, మ్యూజిక్ ప్లేయర్ తదితర అంశాలు శ్రోతకు అలుపెరగని వినోదాన్నిపంచుతాయి. అతి త్వరలో గ్యాడ్జెట్ స్టోర్లలో లభ్యంకానున్న ఈ మొబైల్ ధర వివరాలు తెలియాల్సి ఉంది.
క్లుప్తంగా ఫీచర్లు:
- డ్యూయల్ సిమ్,
- 6.6 cm స్ర్కీన్,
- 256 K కలర్స్,
- ఇన్ బుల్ట్ కెమెరా,
- పిక్సల్ రిసల్యూషన్ 0.3 మెగా పిక్సల్,
- ఇంటిగ్రేటెడ్ బూమ్ బాక్స్ స్పీకర్స్,
- ఆడియో ప్లేయర్,
- 64 + 32 MB ఫోన్ మెమరీ,
- ఎక్సప్యాండబుల్ ఎక్స్ టర్నల్ మెమరీ,
- రికార్డింగ్ సౌలభ్యతతో ఎఫ్ఎమ్ రేడియో,
- బ్లూటూత్,
- జీపీఆర్ఎస్ సౌలభ్యత,
- WAP వెసలబాటు
- మొబైల్ ట్రాకర్,
- ఎస్ఎమ్ఎస్ ఆర్గనైజర్, షెడ్యూలర్,
- డేటా ప్రొటక్షన్,
- బ్యాటరీ సామర్ధ్యం 1050mAh,
- స్టాండ్ బై టైమ్ 230 గంటలు,
- టాక్ టమై్ 4 గంటలు,
- చుట్టు కొలతలు 119 mm x 52 mm x 14.5 mm.


Click it and Unblock the Notifications








