ఆడవారి కోసం స్లైడర్ డ్యూయల్ సిమ్ మొబైల్ 'కార్బన్ కె33'

Posted By: Staff

ఆడవారి కోసం స్లైడర్ డ్యూయల్ సిమ్ మొబైల్ 'కార్బన్ కె33'

ఇటీవల కాలంలో డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌తో స్టన్నింగ్ డిజైన్ కలిగిన మొబైల్స్‌ని మార్కెట్లో చాలా కంపెనీలు విడుదల చేశాయి. ఐతే ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా.. మొబైల్ తయారీదారులు ఇప్పటి వరకు కేవలం డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌తో క్వర్టీ కీప్యాడ్ కలిగిన మొబైల్స్‌ని మాత్రమే మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇండియన్ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ నుండి స్లైడర్ డ్యూయల్ సిమ్ మొబైల్ 'కార్బన్ కె33'ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ మొబైల్‌ని కేవలం ఆడవారి కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరుగుతుంది.

తక్కవ ధరలో కార్బన్ మొబైల్స్ నుండి రావడమే కాకుండా వైట్ బాడీతో బ్లాక్ కీ ప్యాడ్స్‌ని కలిగి ఉండడం దీని ప్రత్యేకత. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్ స్క్రీన్ సైజుతో రూపోందించడం జరిగింది. దీనితో పాటు స్క్రీన్ రిజల్యూషన్ అందంగా కనిపించేందుకు గాను WVGA TFT టెక్నాలజీని ఇందులో పొందుపరచడం జరిగింది. సోనీ ఎరిక్సన్ నుండి విడుదలైన వాక్ మెన్ సిరిస్‌కు ఈ కార్బన్ కె33 సరితూగుతుంది.

2 మెగా ఫిక్సల్ కెమెరా కలిగి ఉండడం వల్ల ఇమేజీలను కూడా చక్కగా తీయవచ్చు. డిజిటల్ జూమ్, వీడియో క్యాప్చరింగ్, వీడియో రికార్డింగ్ అదనపు ప్రత్యేకతలు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఇందులో ఉన్న 8జిబి మొమొరీ కార్డులో మీకు కావాల్సిన అన్ని రకాల ఆడియో, వీడియో సాంగ్స్‌ని పోందుపరచుకోవచ్చు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు గాను 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం.

ఇటీవల కాలంలో అన్ని రకాల కంపెనీలు చక్కని బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందిస్తున్న విషయం తెలిసిందే. కార్బన్ కె33లో 1000 mAh Lion బ్యాటీరని ఇమడింపజేయడం జరిగింది. ఇక బ్యాటరీ టాక్ టైమ్ విషయానికి వస్తే 4 గంటలు రాగా, అదే స్టాండ్ బై టైమ్ మాత్రం కేవలం 300గంటలు. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్, యుఎస్‌బిని సపోర్ట్ చేస్తాయి.

ఈ నెల చివరికల్లా కార్బన్ కె33కి సంబంధించిన మరింత సమాచారం మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ధర కూడా మార్కెట్లో ఇంకా వెల్లడించకపోయినప్పటికీ సుమారూగా రూ 4,000 వరకు ఉండవచ్చునని నిపుణుల అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot