కార్బన్ కొత్త ఫోన్!!

Posted By: Staff

కార్బన్ కొత్త ఫోన్!!

 

మొబైల్ ఫోన్ల అమ్మకాలలో కొత్త ఒరవడికి నాంది పలికిన కార్బన్ (Karbonn) సరికొత్త ఫీచర్లతో కొత్త తరహా మొబైల్ ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఫ్లిప్ మోడల్‌లో విడుదలవుతున్న ‘కార్బన్ 444’ (Karbonn K44) ప్లస్, మైనస్ పాయింట్లను పరిశీలిద్దాం...

రెండు నెట్ వర్క్‌లు పనిచేసే విధంగా డ్యూయల్ సిమ్ వ్యవస్థను మొబైల్‌లో ఏర్పాటు చేశారు. రెండు అంగుళాల QCIF డిస్‌ప్లే 128 x 160 రిసల్యూషన్ కలిగి ఉంటుంది. వీజీఏ కెమెరా వ్యవస్థ, WAP బ్రౌజర్‌ను సపోర్ట్ చేసే జీపీఆర్ వ్యవస్థ, v2.0 బ్లూటూత్ కనెక్టువిటీ వ్యవస్థ ఫైట్ ట్రాన్సఫరింగ్‌కు దోహడపడుతుంది. మెమరీని 4జీబి వరకు పెంచుకోవచ్చు.

మొబైల్ ట్రాకర్ సిస్టంను ఇంటిగ్రేట్ చేశారు. షెడ్యూల్ ఎస్ఎమ్ఎస్ విధానం మీ బంధాలను ధృడపరుస్తుంది. క్లాసికల్ కోణంలో వినోదాన్ని పంచే ఆడియో, వీడియో ప్లేయర్లను డివైజులో నిక్షిప్తం చేశారు. మరింత సమచారాన్ని చేరువ చేసే విధంగా ఎఫ్ఎమ్ రేడియో ప్లేబ్యాక్, రికార్డింగ్ అప్లికేషన్‌ను గ్యాడ్జెట్లో లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన 850 mAh బ్యాటరీ 190 గంటల స్టాండ్ బై, 3 గంటల టాక్ టైమ్ నిస్తుంది. ధర రూ.2500.

నిరుత్సాహా పరిచే అంశాలు:

చిన్న స్ర్కీన్ తక్కువ మోతాదు కలిగిన రిసల్యూషన్ నిరుత్సాహానికి గురి చేస్తుంది. మిగిలిన కార్బన్ హెడ్ సెట్లతో పోలిస్తే K44లో తక్కువ బ్యాటరీ సామర్ధ్యం, మెమరీని పెంచుకునేందుకు తక్కువ వెసలబాటును కల్పించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting