మాస్ జనానికెక్కితే సూపర్ హిట్టే!!

Posted By: Super

మాస్ జనానికెక్కితే సూపర్ హిట్టే!!

 

మధ్య తరగతి మొబైల్ ప్రియుల నేస్తం కార్బన్ ఈ హాట్ సమ్మర్‌లో మరో కూల్ హిట్ పై గురి పెట్టింది. కార్బన్ కె630 పేరుతో డ్యూయల్ సిమ్ జీఎస్ఎమ్ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసేందుకు బ్రాండ్ సిద్ధంగా ఉంది. 85 గ్రాముల బరువు కలిగిన ఈ ఫోన్ ఉత్తమ కమ్యూనికేషన్ వ్యవస్థను ఒదిగి ఉంది. ఇతర వివరాల్లోకి వెళితే....

ఫోన్ స్ర్కీన్ 2.6 అంగుళాలు (రిసల్యూషన్ 240 x 320 పిక్సల్స్),

QVGA TFT Display,

1.3 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా (డిజిటల్ జూమ్ సౌలభ్యత), వీడియో రికార్డింగ్, 128 ఎంబీ ఇంటర్నల్ మెమరీ,

బాహ్య విస్తీర్ణ మెమరీ 16జీబి వరకు,

డ్యూయల్ సిమ్,

జీఎస్ఎమ్ సపోర్ట్,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్రౌజర్ (WAP),

నెట్‌వర్క్ సపోర్ట్ 2జీ (జీఎస్ఎమ్),

ఆడియో ప్లేయర్, వీడయో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

880 లియోన్ బ్యాటరీ ( స్టాండ్ బై 200 గంటలు, టాక్ టైమ్ 3.5 గంటలు), ధర అంచనా రూ.2500 నుంచి 3000 మధ్య.

ఇంగ్లీష్, హిందీ భాషలను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కాల్ కాన్ఫిరెన్స్, వాయిస్ రికార్డింగ్, యాంటీ తెఫ్ట్ వంటి ఫీచర్లు హ్యాండ్ సెట్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఏర్పాటు చేసిన బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలను డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి. బ్లాక్, రెడ్, వైట్, బ్లూ ఇతర సిల్వర్ షేడ్ కలర్ వేరియంట్ లలో కార్బన్ కె630 లభ్యం కానుంది. విడుదలకు సంబంధించి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot