కార్బన్ కె7 మొబైల్ ఇప్పుడు పదిహేను వందలకే..!!!

Posted By: Super

కార్బన్ కె7 మొబైల్ ఇప్పుడు పదిహేను వందలకే..!!!

 

మధ్య తరగతి మొబైల్ మార్కెట్‌ను  కొల్ల గొట్టిన కార్బన్ (Karbonn) రెట్టింపు  ఉత్సకతతో ముదుకు సాగుతోంది. ఈ బ్రాండ్ తాజాగా కె7(K7) మొబైల్  ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆడ్వాన్సడ్  ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ తదితర ప్రయోజనకరమైన అంశాలు ఈ మొబైల్లో దాగున్నాయి. క్లాసికల్ లుక్, జీఎస్ఎమ్ నెట్ వర్క్‌ను సపోర్ట్ చేసే డ్యూయూల్ సిమ్ సౌలభ్యత, 2.4 అంగుళాల టీఎఫ్టీ కలర్ డిస్‌ప్లే, 128 ఎంబీ నాన్ ప్లాష్ మెమరీ, 32 ఎంబీ స్టాటిక్ ర్యామ్‌లను ఫోన్లో నిక్షిప్తం చేశారు.

కార్బన్ ‘కె7’ను మోడెమ్ (modem)లా ఉపయోగించుకోవచ్చు. జీపీఆర్ఎస్ (GPRS) ఇంటర్నెట్ కనెక్టువిటీ ఆప్షన్‌ను ఫోన్లో నిక్షిప్తం చేశారు.  WAP బ్రౌజర్,  MMS వ్యవస్థలను డివైజు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్ v2.0 వర్షన్ బ్లూటూత్ వ్యవస్థ ఇతర బ్లూటూత్ డివైజల నుంచి డేటా షేరింగ్‌కు దోహదపడుతుంది.

మొబైల్‌లో పొందుపరిచిన 1800 mAh సామర్ధ్యం గల బ్యాటరీ 6 గంటల బ్యాకప్, 300 గంటల స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మెమరీని 8 జీబి వరకు పెంచుకోవచ్చు. మీడియా ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో శ్రోతకు నిరంతర వినోదాన్ని పంచుతాయి.

గ్యాడ్జెట్‌లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ 640 x 480 పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. మొబైల్ టార్చ్ తదితర ఇన్‌బుల్ట్ అప్లికేషన్లు లోడ్ కాబడి ఉన్న కార్బన్ కె7 మొబైల్ ధర రూ.1500 మాత్రమే. ఇంకెందకు ఆలస్యం.. వెంటనే మీ సమీప మొబైల్

స్టోర్‌ను సంప్రదించండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot