కార్బన్ నుంచి మరో థండర్!!!

Posted By: Staff

కార్బన్ నుంచి మరో థండర్!!!

 

మారతున్న ట్రెండ్‌లను అంచనావేస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ హ్యాండ్‌సెట్‌లను కార్బన్ ప్రవేశపెడుతుంది. మన్నికే ప్రధానంగా శ్రమిస్తున్న కార్బన్ ఇప్పటికే మధ్య తరగతి మొబైల్ మార్కెట్ పై పట్టు సాధించింది. ఈ బ్రాండ్ తాజాగా ‘K99 థండర్ బాక్స్ డ్యూయల్ సిమ్’ పాకెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

3జీ నెట్‌వర్క్‌తో పాటు పటిష్టమైన ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థలను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. 90 గ్రాముల బరువు కలిగిన ఈ ఫోన్ 64 ఎంబీ రోమ్, 32ఎంబీ పటిష్ట ర్యామ్ వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఎక్స్‌టర్నల్ మెమెరీ 8జీబి. పీసీ సింక్రనైజేషన్ వ్యవస్థను డివైజ్‌లో బలోపేతం చేశారు. ఈ సౌలభ్యతతో ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. మల్టీ లాంగ్వెజ్ ఆప్షన్‌ను మొబైల్‌లో ఏర్పాటు చేశారు. డివైజ్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తూ ట్రాకింగ్ అప్లికేషన్‌ను దోహదం చేశారు.

డివైజ్‌లో ఏర్పాటు చేసిన వన్‌టచ్ ఎఫ్ఎమ్ రేడియో, ఆడియో మరియు వీడియో ప్లేయర్, ఇన్‌బుల్ట్ గేమ్స్ వినోదపు అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తాయి. ప్రత్యక్షంగా వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు వీజీఏ కెమెరాను డివైజ్ ముందు భాగంలో అమర్చారు. ‘కార్బన్ కె99 థండర్ బాక్స్’ మొబైల్ ధర, మార్కెట్లో విడుదల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

mobile, karbonn, thunder box, pc syncronization, మొబైల్, కార్బన్, ధండర్ బాక్స్, పీసీ సింక్రనైజేషన్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot