మార్కెట్ అంతా కెవ్వు..కేకే!!

మధ్యతరగతి మొబైల్ బ్రాండ్ కార్బన్ ఉపయుక్తమైన ఫీచర్లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కార్బన్ కెటీ81ను భారత విపణిలో లాంచ్ చేసింది. యువతను ఉర్రూతలూగించే డాల్బీ సౌండ్ వ్యవస్థతను ఈ గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు. మ్యూజిక్ ప్రియులకు ఈ హ్యాండ్‌సెట్ మరింత నచ్చుతుంది. నిక్షిప్తం చేసిన డాల్బీ సౌండ్ సిస్టం, క్వాలిటీ ఆడియో ప్లేయర్ ఇంకా ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థలు నాన్‌స్టాప్ వినోదాలను చేరువ చేస్తాయి. మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను వినియోగదారు ఆశించవచ్చు. డివైజ్ వెనుక భాగంలో అమర్చిన 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. కార్బన్ మరియు డాల్బీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డిజైన్ కాబడిన ఈ ఫోన్ మార్కెట్ అంచనా రూ. 5,000. విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే…
- 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
- రిసల్యూషన్ 2048х1536పిక్సల్స్
- ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం,
- 3 మెగా పిక్సల్ కెమెరా (డిజిటల్ జూమ్ సౌలభ్యత),
- వీడియో రికార్డింగ్ సౌకర్యం,
- ఫోన్‌బుక్ సామర్ధ్యం (2000 ఎంట్రీల వరకు),
- ఎక్సటర్నల్ స్టోరేజ్ 16జీబివరకు,
- ఎడ్జ్ కనెక్టువిటీ,
- వై-ఫై,
- బ్లూటూత్,
- యూఎస్బీ కనెక్టువిటీ,
- జీపీఎస్ ఫెసిలిటీ,
- హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్,
- నెట్‌వర్క్ సపోర్ట్ ( 2జీ, 3జీ),
- ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
- గేమ్స్,
- లౌడ్ స్పీకర్, ఆడియో జాక్,
- 1000 mAh బ్యాటరీ.


Click it and Unblock the Notifications








