కార్బన్ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ కార్బన్ నాలుగు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. స్మార్ట్ ఏ52 ప్లస్ (ధర రూ.3,099), స్మార్ట్ ఏ11 స్టార్ (ధర రూ.4,499), స్మార్ట్ ఏ12 స్టార్ (ధర రూ.4,099), స్మార్ట్ ఏ50 ఎస్ (ధర రూ.2,699) మోడల్స్‌లో రూపుదిద్దుకున్నఈ స్మార్ట్‌ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

 
కార్బన్ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ స్మార్ట్ ఏ52 ప్లస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 3.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480 పిక్సల్స్), డ్యూయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్), 512 ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.3,099

కార్బన్ స్మార్ట్ ఏ11 స్టార్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (WVGA రిసల్యూషన్ 480x800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్. ధర రూ.4,499.

కార్బన్ స్మార్ట్ ఏ12 స్టార్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4 అంగుళాల IPS WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ సపోర్ట్, ఫోన్ ధర రూ.4,099.

కార్బన్ స్మార్ట్ ఏ50 ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల టీఎఫ్టీ LCD HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.2,699.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X