కార్బన్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ కార్బన్ బుధవారం మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. టైటానియమ్ హెక్సా, టైటానియమ్ ఆక్టా, టైటానియమ్ ఆక్టా ప్లస్ వేరియంట్‌లలో పరిచయమైన ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.16,990, రూ.14,490, రూ.17,990. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ డివైస్‌లను మార్కెట్లో విక్రయించనున్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్, మీడియాటెక్ ప్రాసెసర్ వంటి అత్యాధునిక స్పెసిఫికేషన్‌లను ఈ డివైస్‌లలో నిక్షిప్తం చేసారు.

 
కార్బన్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ టైటానియమ్ హెక్సా స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్టీపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్1280x 1920పిక్సల్స్), స్ర్కాచ్ రెసిస్టెంట్ వోలియోఫోబిక్ కోటింగ్, సరికొత్త మీడియాటెక్ ఎంటీ6591 హెక్సా కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, బ్లూటూత్ 4.0, జీపీఎస్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కార్బన్ టైటానియమ్ ఆక్టా స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, జీపీఎస్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కార్బన్ టైటానియమ్ ఆక్టా ప్లస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా‌ కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, జీపీఎస్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X