Home
Mobile

కార్బన్, లావా నుంచి త్వరలో విండోస్ స్మార్ట్‌ఫోన్‌లు

దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలైన కార్బన్, లావాలు రానున్న నెలల్లో విండోస్ ఆధారిత స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించాయి. మే ఆఖరి నాటికి విండోస్ ఆపరేటింగ్ పై స్పందించే 4 స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని కార్బన్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జెయిన్ పీటీఐకు వెల్లడించారు. వీటి ధరలు ధరలు రూ.6,000 నుంచి రూ.12,000 మధ్య ఉంటాయని ఆయన తెలిపారు.

 కార్బన్, లావా నుంచి త్వరలో విండోస్ స్మార్ట్‌ఫోన్‌లు

మరో వైపు లావా ఇంటర్నేషనల్ సీఈఓ ఇంకా ఎండీ హరి ఓమ్ రాయ్ మాట్లాడుతూ తాము రూపొందించబోయే విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను జూలై నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని, వీటి ధరలు రూ.6,500 నుంచి రూ.8,500 మధ్య ఉంటాయని తెలిపారు. ఈ విండోస్ డివైస్‌లు విండోస్ ప్లాట్‌ఫామ్ ఇంకా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయని రాయ్ పేర్కొన్నారు.

తాము 9 మంది విండోస్ ఫోన్ భాగస్వాములతో పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విండోస్ ఫోన్ భాగస్వామ్య కంపెనీల పేర్లను పరిశీలించినట్లయితే ఫాక్స్‌కాన్, జియోనీ, జేఎస్ఆర్, కార్బన్, లావా (జోలో), లెనోవో, ఎల్‌జీ, లాంగ్‌చీర్, జెడ్‌టీఈ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X