TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మార్కెట్లోకి కార్బన్ ఓపియమ్ స్మార్ట్‌ఫోన్‌లు
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ కార్బన్ తన ఓపియమ్ సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ఓపియమ్ ఎన్7 (Opium N7), ఓపియమ్ ఎన్9 (Opium N9) వేరియంట్‌లలో లభ్యమవుతోన్న ఈ ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ హోమ్‌షాప్18 (HomeShop18) ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఈ క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ధరలను విశ్లేషించినట్లయితే... ఓపియమ్ ఎన్7 ధర రూ.5,999 . ఓపియమ్ ఎన్9 ధర రూ.8,999. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.
కార్బన్ ఓపియమ్ ఎన్7 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 ×480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కార్బన్ ఓపియమ్ ఎన్9 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.