మార్కెట్‌లోకి కార్బన్ రీ-ఎంట్రీ.. రూ.15 వేల లోపే 7000mAh బ్యాటరీతో రెబెల్ 5G ఫోన్లు లాంచ్!
భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘కార్బన్’ (Karbonn) మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. రేపు, అంటే నవంబర్ 2న 'రెబెల్ (Rebel)', 'రెబెల్ ప్రొ 5జి (Rebel Pro 5G)' మోడళ్లను అమెజాన్ వేదికగా లాంచ్ చేయనుంది. ఎటువంటి అనవసర యాప్స్ లేని క్లీన్ ‘ఆండ్రాయిడ్ 16’ (Android 16) ఆపరేటింగ్ సిస్టమ్, భారీ బ్యాటరీ, రీజనబుల్ బడ్జెట్ ధరలను కంపెనీ ప్రధానంగా ప్రమోట్ చేస్తోంది. వీటితో పాటు రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, రెండేళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని టీజర్లలో వెల్లడించింది. కేవలం భారీ స్పెసిఫికేషన్ల కంటే, రోజంతా నిలిచే బ్యాటరీ లైఫ్, ఎలాంటి ల్యాగ్ లేని క్లీన్ సాఫ్ట్‌వేర్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లు వస్తున్నాయి.
అమెజాన్ మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ల ప్రధాన స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. కార్బన్ రెబెల్ మోడల్‌లో 650 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే, 7,000mAh భారీ బ్యాటరీ, 18W ఛార్జింగ్, 3.5mm ఆడియో జాక్, బాక్స్‌లోనే ఛార్జర్ వస్తున్నాయి. ఇక రెబెల్ ప్రొ వెర్షన్‌లో 720 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీ, 20W ఛార్జింగ్‌తో పాటు అడాప్టర్ ఇస్తున్నారు. కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. రెబెల్ మోడల్ బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో దొరుకుతుంది. ప్రొ వర్షన్ బ్లూ, బర్గండి, గోల్డ్, గ్రే రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఈ రెండింట్లోనూ 'జీరో బ్లాట్‌వేర్'తో కూడిన ఆండ్రాయిడ్ 16 అందిస్తున్నారు.

అమెజాన్‌లో లాంచ్ కానున్న కార్బన్ రెబెల్, రెబెల్ ప్రొ 5జి
కార్బన్ ఈ ఫోన్ల స్టోరేజ్ వేరియంట్లను ఇంకా ప్రకటించలేదు. అయితే, బడ్జెట్ ప్రియులను ఆకట్టుకునేలా ప్రారంభ ధరను ₹15,000 కంటే తక్కువగానే నిర్ణయించవచ్చని భావిస్తున్నారు. రెబెల్ మోడల్‌లో పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, సాధారణ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉన్నందున ఇది ప్రొ మోడల్ కంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. కేవలం బెంచ్‌మార్క్ స్కోర్ల కంటే ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్ ముఖ్యం అనుకునే విద్యార్థులకు, మొదటిసారి 5జి ఫోన్ కొనేవారికి ఇవి మంచి ఆప్షన్‌గా మారనున్నాయి. అమెజాన్ పోస్టర్లలో కలర్ వేరియంట్లతో పాటు క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఇస్తామనే విషయాన్ని కంపెనీ స్పష్టం చేసింది.
కార్బన్ రెబెల్, రెబెల్ ప్రొ 5జి ధర, సేల్ వివరాలు, అమెజాన్ ఆఫర్లు
ఈ ఫోన్లు లాంచ్ సమయంలో అమెజాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. రేపటి లాంచ్‌తో పాటే మొదటి సేల్ కూడా ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం దివాళీ వారం వరకు 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026' సేల్ నడుస్తుండటంతో.. బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు భారీగా లభించవచ్చు. ఫోన్లు అధికారికంగా విడుదలయ్యాక అమెజాన్ పేజీలలో లభించే కార్డ్ క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను గమనించడం మంచిది. ఈసారి నవంబర్ 8న దీపావళి ఉండటంతో, పండుగ ఆఫర్ల సీజన్ హోరెత్తనుంది.
కార్బన్ రెబెల్ సిరీస్‌ను కొనుగోలు చేయవచ్చా?
మంచి బ్యాటరీ లైఫ్, ఎలాంటి ల్యాగ్ లేని సాఫ్ట్‌వేర్ కోరుకునే విద్యార్థులకు లేదా సెకండరీ ఫోన్ కోసం చూస్తున్న వారికి 'కార్బన్ రెబెల్' సరిగ్గా సరిపోతుంది. ఇక ‘రెబెల్ ప్రొ’లోని 120Hz డిస్‌ప్లే సరైన ధరలో వస్తే గేమింగ్, స్క్రోలింగ్‌కు చాలా స్మూత్‌గా ఉంటుంది. కెమెరా, ప్రాసెసర్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు; ప్రొ మోడల్‌లో 'యూనిసోక్ (Unisoc)' ప్రాసెసర్ ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. కాబట్టి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు రేపు రాబోయే అధికారిక వివరాలు, రివ్యూలను చూడటం శ్రేయస్కరం. అలాగే లాంచ్ ఆఫర్లు, అమెజాన్ ఎక్స్ఛేంజ్ బోనస్‌లపై కూడా ఒక కన్నేసి ఉంచండి.


Click it and Unblock the Notifications
