కార్బన్ నుంచి చౌక ధర 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

Posted By:

ఇండియాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ కార్బన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో డ్యూయల్ సిమ్ 3జీ, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కార్బన్ స్మార్ట్ ఏ5ఐ (Karbonn Smart A5i) మోడల్‌లో లభ్యంకానున్న ఈ చవక ధర స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ రూ.3,699కి ఆఫర్ చేస్తోంది.

 కార్బన్ నుంచి చౌక ధర 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే... 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ2.3  జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).

కనెక్టువిటీ ఫీచర్లు : డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), వై-ఫై, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, WAP, యూఎస్బీ ఇంకా బ్లూటూత్.

ప్రీలోడెడ్ ఫీచర్లు: గూగుల్ ప్లే‌స్టోర్, గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ టాక్, యూట్యూబ్ ఇంకా ఇతర అప్లికేషన్‌లు. 1420ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ (4 గంటల 2జీ టాక్‌టైమ్, 100 గంటల 2జీ స్టాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot