3జిబి ర్యామ్,13 ఎంపీ బ్యాక్, ఫ్రంట్ కెమెరా ఫోన్, కేవలం రూ. 6,999కే !

By Hazarath
|

దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'టైటానియం ఫ్రేమ్స్ ఎస్7'ను తాజాగా విడుదల చేసింది. కాగా ఈ ఫోన్ వినియోగదారులు షాప్‌క్లూస్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధరను కంపెనీ రూ.6,999గా నిర్ణయించింది. కాగా 5.5 ఇంచ్ భారీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు తదితర ఫవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. పూర్తిగా మెటల్ ఫినిషింగ్‌తో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. దీని వల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. దీంతో పాటు ఎయిర్‌టెల్ ఈ ఫోన్ మీద సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నది. ఈ ఫోన్ కొన్న తరువాత వినియోగదారులు ఈ ఫోన్‌లో ఎయిర్‌టెల్ సిమ్ వేసి నెలకు రూ.199 ఆపైన ప్లాన్‌తో 36 నెలల పాటు వాడితే రూ.2వేల క్యాష్ బ్యాక్ వస్తుంది.

 

కుంటిసాకులు చెప్పకండి, టెలికాం దిగ్గజాలను ఆడేసుకున్నకేంద్రం !కుంటిసాకులు చెప్పకండి, టెలికాం దిగ్గజాలను ఆడేసుకున్నకేంద్రం !

కార్బన్ టైటానియం ఫ్రేమ్స్ ఎస్7 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

కార్బూన్  కె9

కార్బూన్ కె9

సెప్టెంబర్లో లాంచ్ అయిన దీని ధర రూ. రూ.5,290
ఫీచర్ల విషయానికొస్తే.. 5.2 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

కార్బూన్ ఔరా 9 స్మార్ట్ ఫోన్

కార్బూన్ ఔరా 9 స్మార్ట్ ఫోన్

దీని ధర 6,999.ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఓఎస్ పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ లో 5 అంగుళా తెర,4000 ఎంఎహెచ్ బ్యాటరీ,1జిబి ర్యామ్,8ఎంపీ రియల్ కెమెరా 8జిబి మెమొరి 5 మెగా ఫిక్స్ ల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Aadhaar ఇప్పటిదాకా ఎక్కడ వాడారో తెలుసుకోవడం ఎలా ? ( సింపుల్ ట్రిక్స్ )
కార్బన్ 'ఆరా స్లీక్ 4జీ
 

కార్బన్ 'ఆరా స్లీక్ 4జీ

ధర రూ. రూ.5,290,

కార్బన్ ఆరా స్లీక్ 4జీ ఫీచర్లు

5 ఇంచ్ డిస్‌ప్లే

1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

కార్బన్ ఆరా నోట్ 4

కార్బన్ ఆరా నోట్ 4

ధర రూ. 6890

కార్బన్ ఆరా నోట్ 4జీ ఫీచర్లు...
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
4జీ వీవోఎల్‌టీఈ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Karbonn Titanium Frames S7 smartphone with 3GB RAM launched at Rs 6,999 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X