రూ.5,749కే బ్రాండెడ్ క్వాలిటీ క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్
బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను అందించే లక్ష్యంతో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ కార్బన్ ‘టైటానియమ్ ఎస్1 ప్లస్' (Karbonn Titanium S1 Plus) పేరుతో క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై స్పందించే సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్‌ను ఆన్‌లైన్ మార్కెట్లో విడదుల చేసింది. ధర రూ.5,749. సాహోలిక్, ఇండియాటైమ్స్ వంటి రిటైలింగ్ వెబ్‌సైట్‌లు ఈ డివైస్‌ను ఆఫర్ చేస్తున్నాయి.

4 అంగుళాల తాకే తెర, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్, వై-ఫై కనెక్టువిటీ వంటి స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను ఈ డివైస్‌లో నిక్షిప్తం చేసారు. కార్బన్ టైటానియమ్ ఎస్1 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన టైటానియమ్ ఎస్1 ప్లస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
4 అంగుళాల తాకే తెర (రిసల్యూషన్ 400 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్, వై-ఫై, 3జీ, ఏ-జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్ కనెక్టువిటీ).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications