సెల్ఫీ ఫోన్.. కార్బన్ టైటానియమ్ ఎస్19

భారతదేశపు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కార్బన్, ‘టైటానియమ్ ఎస్19' పేరుతో సరికొత్త సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.8,999. సెల్ఫీలను అత్యుత్తమ క్వాలిటీతో చిత్రీకరించుకునేందుకుగాను 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసారు. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ కెమెరా, సోనీ ఎక్స్‌మార్ సెన్సార్ ఫీచర్‌ను కలిగి ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫికి దోహదపడుతుంది. ఈ కెమెరా ద్వారా వీడియోలను 1080 పిక్సల్ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. వాయిస్ ఆధారిత క్యాప్చర్, లైవ్ ఫోటో మోడ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
కార్బన్ టైటానియమ్ ఎస్19 కీలక స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (ఓజీఎస్ టెక్నాలజీతో),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








