వరసగా ‘క్యూ’ కడుతున్నారు!

కంప్యూటింగ్ పరికరాలు ప్రాసెసింగ్ చిప్‌లను సమకూర్చటంలో ఇంటెల్ సంస్థ క్రీయాశీలక పాత్రపోషిస్తోంది. వ్యాపార సామ్రజ్యాన్ని మరింత విస్తరించుకనే క్రమంలో ఇంటెల్ మొబైల్ ఫోన్‌లకు చిప్‌లను సమకూర్చేందుకు ముందుకొచ్చింది. ఈ నేపధ్యంలో ప్రముఖ మొబైల్ ఫోన్‌ల నిర్మాణ సంస్థ లావా, ఇంటెల్‌తో జత కట్టి ఇంటెల్ ప్రాసెసర్ ఆధారిత తొలి స్మార్ట్‌ఫోన్ ‘జోలో900’ను ప్రవేశపెట్టింది.
మరో దేశీయ కంపెనీ కార్బన్, ఇంటెల్‌తో జతకట్టింది. వీరద్దరి భాగస్వామ్యంలో ఓ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఈ అంశాన్ని స్వయానా కార్బన్ మొబైల్స్ మేనేజిండ్ డైరెక్టర్ ప్రదీప్‌జైన్ వెల్లడించారు. ఈ ఫోన్ ధర ఇంకా
స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. దేశీయ బ్రాండ్‌లైనా కార్బన్, లావాలతో పాటు మోటరోలా, లెనోవో వంటి అంతర్జాతాయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సైతం ఇంటెల్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
కార్బన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ప్రాజెక్ట్!
మొబైల్ తయారీ బ్రాండ్ కార్బన్ త్వరలో ప్రవేశపెట్టనున్న ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆధారిత టాబ్లెట్ పీసీ స్మార్ట్ ట్యాబ్-4 పై నెలకున్న సందిగ్థతకు తెరపడింది. కార్బన్ మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జెయిన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ 9.7 అంగుళాల స్ర్కీన్ సైజును కలిగి గుగూల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ జెల్లీబీన్ పై రన్ అయ్యే టాబ్లెట్ కంప్యూటర్ ‘స్మార్ట్ ట్యాబ్ -4’ను అగష్టులో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. డివైజ్ ధరను రూ.11,000గా నిర్ణయించినట్లు సమాచారం.
కార్బన్ స్బార్ట్ ట్యాబ్-4 కీలక పీచర్లు:
9.7 అంగుళాల టచ్ స్ర్కీన్,
గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
3జీ కనెక్టువిటీ సౌలభ్యత (డాంగిల్ ద్వారా),
వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
ధర రూ.11,000.


Click it and Unblock the Notifications







