కార్బన్ నుంచి రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By: Prashanth

కార్బన్ నుంచి రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

 

మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ కార్బన్ రెండు ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను మరో పది రోజుల్లో విడుదల చేయ్యనుంది. కార్బన్ ఏ7, కార్బన్ ఏ9గా డిజైన్ కాబడిన ఈ హ్యాండ్ సెట్ల ఫీచర్లు...

- 2.8 అంగుళాల మల్టీ టచ్ డిస్‌ప్లే,

- ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- డ్యూయల్ సిమ్.

ఈ రెండు హ్యాండ్‌సెట్లలో అనేక రకాలైన అప్లికేషన్‌లతో పాటు వివిధ గేమ్‌లను లోడ్ చేశారు. కార్బన్ ఏ9లో నిక్షిప్తం చేసిన సిరీ (వాయిస్ కమాండ్) అప్లికేషన్ యూజర్‌కు మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఈ ఫోన్‌ల ధరలు రూ.5000 నుంచి 6,000 మధ్య ఉంటాయి.

ఇవే తరహా పీచర్లతో స్వదేశీ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్, స్పైస్‌లు రూపొందించిన ఫోన్ల ధరలు రూ.7,000 దాకా ఉన్నాయి. కొంచెం పెద్ద స్ర్కీన్‌తో శామ్‌సంగ్ గెలక్సీ వై పైన పేర్కొన్న ధరకే లభ్యమవుతోంది. స్పైస్ రూపొందించిన మరో ఫోన్ Mi 280, 2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి రూ.5,000 ధరకు లభ్యమవుతోంది. ఈ నేపధ్యంలో కార్బన్ విడుదల చేస్తున్న ఏ8, ఏ9 హ్యాండ్ సెట్లు ఏ మేరకు మెప్పిస్తాయో చూడాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot