ఆమె అందాలను ఎర వేసి?

Posted By: Prashanth

ఆమె అందాలను ఎర వేసి?

 

డిజిటల్ ఉత్పత్తుల తయారీ రంగంలో దేశీయంగా రాణిస్తున్న సంస్థ ఐబాల్ . ఈ బ్రాండ్ తాజాగా ‘ఆండీ’ సిరీస్ నుంచి విడుదల చేస్తున్న ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను బాలివుడ్ అందాల భామ కరీనా కపూర్ ఆవిష్కరించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లను యువతకు చేరువ చేసే క్రమంలో బాలివుడ్ భామ కరీనాను ప్రచారకర్తగా ఎంపికచేసినట్లు సంస్థ సంచాలకులు సందీప్ పరసరామ్ పూరియా తెలిపారు. తాను ఐబాల్ వంటి ‘డైనమిక్ డిజిటల్ బ్రాండ్’తో కలిసి పనిచేయటం ఆనందంగా ఉందని కరీనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆండీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వర్షన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు శక్తివంతమైన ప్రాసెసర్, హై క్వాలటీ కెమెరా, పటిష్టమైన 3జీ నెట్‌వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘ఐబాల్ ఔరా3’ ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

ఉత్తమ క్వాలిటీ ఆడియో, వీడియో ప్లేయర్,

జావా ఆపరేటింగ్ సిస్టం,

1200mAh బ్యాటరీ,

3.5’’టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఎఫ్ఎమ్ రేడియో,

యూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ,

16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

4జీబి మైక్రోఎస్డీ కార్డ్,

ధర రూ. రూ.4,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot