చైనా టార్గెట్ భారత్?

Posted By: Staff

 చైనా టార్గెట్ భారత్?

 

మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలో చైనా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ దేశానికి చెందిన అనేక బ్రాండ్‌లు భారత మార్కెట్లలో హవాను కొనసాగిస్తున్నాయి. వ్యాపారానికి పూర్తి స్థాయి అనువైన ఇండియా వంటి దేశాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తిరించేందుకు చైనా సంస్థలు అనేక వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెడుతున్నాయి. ఈ కోవకే చెందిన  చైనా  మొబైల్ నిర్మాణ సంస్థ కిన్ జిన్ డా అత్యంత చిన్నదైన మొబైల్ ఫోన్‌ను దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలను చేస్తుంది.  పేరు ‘ఎమ్2’.పాకెట్ అదేవిధంగా అరచేతిలో సౌకర్యవంతంగా ఇమిడగలిగే స్వభావాన్ని ఈ హ్యాండ్‌సెట్ కలిగి ఉంది. ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే డ్యూయల్ సిమ్ నెట్‌వర్క్ సపోర్ట్ యూజర్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. నిర్మించిన కీప్యాడ్ సందేశాలు పంపుకునేందుకు మరింత అనువుగా సహకరిస్తుంది. కాల్ బటన్ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తుంది.

నిక్షిప్తం చేసిన బ్యాటరీ 240 నిమిషాల టాక్‌టైమ్ నివ్వగలదు. డివైజ్‌లో పొందుపరిచిన ఆడియో ప్లేయర్ వీడియో ప్లేయర్ వ్యవస్థలు క్వాలిటీతో వినోదాన్ని వినోదాన్ని చేరువచేస్తాయి. హ్యాండ్‌సెట్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన వీజీఏ ఫ్రంట్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. మైక్రోఎస్గీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకోవచ్చు. యూజర్ ఈ హ్యాండ్‌సెట్‌తో అదనంగా ఛార్జర్, మైక్రోయూఎస్బీ కోర్డ్, హెడ్ ఫోన్స్, 2జీబి మెమరీకార్డులను సొంతం చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఎమ్8 ధర అంచనా రూ.1800. సాధారణ మొబైలింగ్ ను ఆస్వాదించాలనుకునే వారికి ఈ హ్యాండ్‌సెట్ ఉపయుక్తమైన ఎంపిక.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot