KFC స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
ఎక్కడ దొరుకుతుందంటే..?
పాపులర్ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ KFC, Huaweiతో చేతులు కలిపి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.KFC Huawei 7 Plus పేరుతో ఈ ఫోన్ దొరుకుతుంది. KFC చైనా మార్కెట్లోకి అడుగుపెట్టి 30 సంవత్సరాల పూర్తి అయిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Huawei కూడా 30 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది...
Huawei కంపెనీ కూడా సరిగ్గా 30 సంవత్సరాల క్రితమే Shenzenలో ప్రారంభమైంది. చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర CNY 1099 (ఇండియన్ కరెన్సీలో ఇంచుమించుగా రూ.10,000లోపు).

జూలై 13 నుంచి విక్రయాలు...
Tmall అనే వెబ్‌సైట్ జూలై 13 నుంచి ఈ ఫోన్‌లను విక్రయించనుంది. KFC మొబైల్, KFC K-మ్యూజిక్, 100,000 ‘‘K- డాలర్స్'' వర్చువల్ క్రెడిట్స్ వంటి ప్రత్యేకమైన యాప్స్ ఈ ఫోన్‌తో పాటుగా వస్తాయి.

KFC Huawei 7 Plus స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 5.1 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్,

ర్యామ్, స్టోరేజ్, కెమెరా...
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3020mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై 802.11 bgn, బ్లుటూత్ 4.1, యూఎస్బీ 2.0, జీపీఎస్, గ్లోనాస్).


Click it and Unblock the Notifications








