కిలిమంజారో కాదండి 'కింజో' అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్..

Posted By: Staff

కిలిమంజారో కాదండి 'కింజో' అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్..

 

అమెరికా కంపెనీ అయిన వెర్జో మార్కెట్లోకి కొత్తగా అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్‌ఫోన్‌ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. దాని పేరు 'కింజో'. వర్జో కంపెనీ ఈ మొబైల్‌ని విడుదల చేసే సంధర్బంలో మాట్లాడుతూ కింజో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఉన్న వేరే ఇతర ఏ కంపెనీకి కూడా పోటీ కాదని అన్నారు. కేవలం వర్జో యూజర్స్‌ని దృష్టిలో పెట్టుకొని మొబైల్‌ని విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ మొబైల్‌ని వాడడం వల్ల యూజర్స్‌కు డిజైన్, అనుభవం మొదలగునవి అలవడుతాయనే ఉద్దేశ్యంతో విడుదల చేయడం జరగుతుందని తెలిపారు.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4.3 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ బరువు 155 గ్రాములు. ఇందులో ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాకి ఆటోఫొకస్, ఎల్‌ఈడి ప్రత్యేకతలు అదనం. మొబైల్ ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1GHz TI OMAP 3630 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

కింజో స్మార్ట్ ఫోన్‌లో 512MB RAMతో పాటు 512MB ROM ప్రత్యేకం. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పై లను కూడా కింజో సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1,590mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. కింజో స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.2 ప్రోయోతో రన్ అవుతుంది. పాఠకులకు కింజో మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

'కింజో' స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

జనరల్

చుట్టుకొలతలు    131.62 x 72.36 x 12.30 mm (5.18 x 2.84 x 0.48 inches)

బరువు    155g (0.34 pounds)

డిస్ ప్లే

టచ్ స్క్రీన్    Capacitive Multi-Touch Screen

సైజు    4.3-inch

రిజల్యూషన్    800x480 pixels

స్క్రీన్ టైపు    TFT

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్    Android 2.2 (Froyo)

ప్రాసెసర్    IFX XMM 6160 + Texas Instruments OMAP 3630 @ 1GHz

మెమరీ    RAM:512MB, ROM:512MB

కెమెరా

కెమెరా    Front 0,3 megapixel (FF), Rear 5 megapixel (AF) with LED

జిపిఎస్    GPS module built-in

సెన్సార్స్    Light sensor, Accelerometer sensor, Proximity sensor

ఆడియో & వీడియో

ఆడియో ఫార్మెట్    AMR / AAC / AAC+ / MP3 / WAV / PCM

వీడియో ఫార్మెట్    MPEG4 / 3GPP / H.263 / H.264

బ్యాటరీ

బ్యాటరీ కెపాసిటీ 1590 mAh battery

బ్యాటరీ టాక్ టైమ్    9 Hours (GSM)

బ్యాటరీ స్టాండ్‌బై టైమ్    Up to 360 Hours (GSM)

కనెక్టివిటీ

వై -పై     802.11 b/g

3జీ    WCDMA

బ్లూటూత్    Bluetooth 2.1+EDR

యుఎస్‌బి    Micro-USB

ఆడియో జాక్    3.5mm stereo audio jack

మెమెరీ స్లాట్    1x MicroSD/SDHC card slot (Supports up to 32GB)

మొదటగా అమెరికాలో విడుదల చేస్తుండడం వల్ల కింజో ఆండ్రాయిడ్ మొబైల్‌ని, ఇండియాలో ఎప్పుడు విడుదల చేయనున్న సంగతి మాత్రం అధికారకంగా ప్రకటించ లేదు. ఇది మాత్రమే కాకుండా దీనికి సంబంధించిన ధర మొదలగు విషయాలను కూడా ప్రకటించ లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot