Airplane మోడ్‌లో ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా ?

మీరు ఎటువంటి స్మార్ట్ఫోన్ ను కలిగి ఉన్నా కూడా, కనీసం ఒక్కసారైనా ఈ Airplane మోడ్ వినియోగించే ఉంటారు.

|

మీరు ఎటువంటి స్మార్ట్ఫోన్ ను కలిగి ఉన్నా కూడా, కనీసం ఒక్కసారైనా ఈ Airplane మోడ్ వినియోగించే ఉంటారు. విమానాల్లో ప్రయాణం చేసే సమయంలో సాధారణంగా వినియోగిస్తుంటారు. ఎక్కువమంది కాల్స్ రాకూడదు అని మాత్రమే ఈ Airplane మోడ్ వినియోగిస్తుంటారు. కొందరైతే కేవలం కాల్స్ రాకుండా మాత్రమే ఉపయోగపడుతుంది అని భావిస్తూ ఉంటారు కూడా. అందరికీ అన్నీ తెలిసి ఉండవు కదా . ఏదిఏమైనా ఈ Airplane మోడ్ వలన లాభాలు అధికమే. ఈరోజు ఈ వ్యాసంలో కొన్ని విషయాలు చెప్పబోతున్నాము. Airplane మోడ్, సహజంగానే సెల్యులర్ సిమ్ సర్వీసులను ఆపివేస్తుంది, మరియు wifi, బ్లూటూత్ సర్వీసులను ఆపివేస్తుంది.

స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి, రూ.11 వేల వరకు తగ్గిన ఫోన్ల వివరాలు ఇవేస్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి, రూ.11 వేల వరకు తగ్గిన ఫోన్ల వివరాలు ఇవే

ఈ Airplane మోడ్ ను వినియోగించుట ఎలా?

ఈ Airplane మోడ్ ను వినియోగించుట ఎలా?

నోటిఫికేషన్ బార్ ను కిందకు లాగడం ద్వారా quick settings లో ఈ Airplane మోడ్ Aeroplane ఐకాన్ తో కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అవసరంలేని టోగుల్స్ ను అమర్పులు చేస్తుంటారు కూడా. కావున కాస్త గమనించవలసి ఉంటుంది. ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా Airplane మోడ్ ఆన్ చేయవచ్చు.

Airplane మోడ్ ద్వారా బాటరీ ఆదా చేయవచ్చా:

Airplane మోడ్ ద్వారా బాటరీ ఆదా చేయవచ్చా:

Airplane మోడ్ ఖచ్చితంగా బాటరీ ఆదాచేస్తుంది. నెట్వర్క్ సంబంధిత అంశాలను పూర్తిగా ఆపివేయడం ద్వారా, ఇతర ప్రక్రియలకు ఆస్కారం ఉండదు. తద్వారా బాటరీ మామూలు మోడ్ తో పోలిస్తే Airplane మోడ్ లో అధికంగా ఆధా అవుతుంది. ఫోన్ చార్జింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది.

 Airplane మోడ్ లో వైఫై వినియోగించవచ్చా?
 

Airplane మోడ్ లో వైఫై వినియోగించవచ్చా?

ఈ సమాధానం మీ ఫోన్ మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ఫోన్లు Airplane మోడ్ లో పూర్తిగా అన్నీ నెట్వర్క్ సంబంధిత అంశాలను ఆపివేస్తుంటాయి. కానీ కొన్ని ఫోన్లు మాత్రం వైఫై వంటి వాటికి అనుమతిని ఇస్తుంటాయి. కానీ Airplane మోడ్ ఆన్ చేసిన వెంటనే, wifi ఆగిపోతుంది. మీరు మరలా వైఫై స్విచ్ఆన్ చేసుకోవలసి ఉంటుంది. తద్వారా Airplane మోడ్ లో కూడా వైఫై పని చేస్తుంది. కానీ అనేకులకు ఈ విషయం మీద అవగాహన లేదు. Airplane మోడ్ వలన పూర్తిగా అంశాలన్నీ ఆగిపోతాయని భావిస్తుంటారు.

Airplane మోడ్ లో ఉన్నప్పుడు అలారం రింగ్ వినిపిస్తుందా?

Airplane మోడ్ లో ఉన్నప్పుడు అలారం రింగ్ వినిపిస్తుందా?

అలారం ఇంటర్నెట్ కనెక్షన్ ను వినియోగించుకోదు. మరియు ఎటువంటి నెట్వర్క్ ఆధారిత అంశాలు అలారం ను ప్రభావితం చేయలేవు. కావున అలారం రింగ్ ఖచ్చితంగా వినిపిస్తుంది.

Airplane మోడ్ లో కాల్స్ స్వీకరించగలమా:

Airplane మోడ్ లో కాల్స్ స్వీకరించగలమా:

ఖచ్చితంగా కుదరదు. Airplane mode లో సిమ్ ఆధారిత సర్వీసులన్నీ నిలిపివేయబడుతాయి. తద్వారా కాల్స్, మెసేజెస్ ఏవీ పని చేయవు. కానీ కొన్ని ప్రాంతాలలో Airplane మోడ్ లో కూడా వాయిస్ మెయిల్ ద్వారా కాల్స్ స్వీకరించే వెసులుబాటు ఉంది.

మ్యూజిక్ ఎంజాయ్ చెయ్యొచ్చా:

మ్యూజిక్ ఎంజాయ్ చెయ్యొచ్చా:

మ్యూజిక్ ప్లేయర్స్ మాత్రమే కాదు, ఇంటర్నెట్ వినియోగం లేని ఎటువంటి అప్లికేషన్స్ అయినా ఎటువంటి సమస్య లేకుండా వినియోగించవచ్చు. గూగుల్ ప్లే వంటి సర్వీసులలో ఆఫ్లైన్ సాంగ్స్ మాత్రమే కాకుండా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కాకపోతే ఈ Airplane మోడ్ లో ఆన్లైన్ స్ట్రీమింగ్ మాత్రం కుదరదు. మీ మొబైల్ లో ఉన్న పాటల వరకు వినే సౌలభ్యం ఉంటుంది .

Airplane మోడ్ వెళ్ళే ముందు ఒకసారి పూర్తిగా తనిఖీ చేసుకోండి :

Airplane మోడ్ వెళ్ళే ముందు ఒకసారి పూర్తిగా తనిఖీ చేసుకోండి :

Airplane మోడ్ మీ నెట్వర్క్ సంబంధిత అంశాలనన్నింటినీ ఆపివేస్తుంది. కానీ, వైఫై వాడుకునే వెసులుబాటు ఉండడం ఆహ్వానించదగ్గ విషయమే. కానీ Airplane మోడ్ పెట్టే ముందు , మీ డౌన్లోడ్స్ అన్నీ పూర్తయ్యాయో లేదో చూసుకున్న తర్వాతే Airplane మోడ్ లోనికి వెళ్ళండి. లేకపోతే అవుతున్న డౌన్లోడ్స్ ఆగిపోయే అవకాశం ఉంది. Airplane మోడ్ వెళ్ళినప్పుడు వైఫై తో పాటు మిగిలిన నెట్వర్క్ కనెక్షన్లన్నీ ముందస్తుగా ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాతనే మరలా వైఫై కనెక్షన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ సమయంలో డౌన్లోడ్స్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డౌన్లోడ్స్ మాత్రమే కాకుండా మిగిలిన ఇతర అంశాలనన్నింటినీ పరీక్షించాకనే Airplane మోడ్ లోకి వెళ్ళండి.

Best Mobiles in India

English summary
Know Everything About Airplane Mode More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X