రూ.16999 నుంచే QLED టీవీలు.. 60W అవుట్‌పుట్, ఇన్‌బిల్ట్ యాప్‌లు.. పూర్తి వివరాలు!
స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్ లు సహా అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు భారత్ అతి పెద్ద మార్కెట్ గా ఉంది. దీంతో అనేక సంస్థలు బడ్జెట్ సహా మిడ్ రేంజ్, ఫ్లాష్‌షిప్ ధర సెగ్మెంట్స్ లో లాంచ్ చేస్తుంటాయి. తాజాగా ప్రముఖ టీవీల తయారీ సంస్థ కోడాక్ భారత్ మార్కెట్ లో నాలుగు డిస్‌ప్లే వేరియంట్స్‌లో QLED టీవీలను లాంచ్ చేసింది. కోడాక్ మ్యాట్రిక్స్ QLED గూగుల్ టీవీ పేరుతో (Kodak Matrix QLED TVs) విడుదల చేసింది.
నాలుగు డిస్‌ప్లే వేరియంట్స్ :
ఈ మ్యాట్రిక్స్ సిరీస్ కొత్త టీవీలు మెరుగైన పిక్చర్ క్వాలిటీ, ఆకట్టుకొనే సౌండ్, అనేక యాప్స్‌ని సపోర్టు చేస్తుందని కోడాక్ చెబుతోంది. కోడాక్ మ్యాట్రిక్స్ QLED గూగుల్ టీవీలను 43, 50, 55, 65 అంగుళాల వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. బేస్ వేరియంట్‌ను బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.

కోడాక్ మ్యాట్రిక్స్ QLED గూగుల్ టీవీ స్పెసిఫికేషన్‌లు :
కోడాక్ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్లు సన్నని బెజిల్ లెస్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. 43, 50, 55 అంగుళాల వేరియంట్స్ ప్రీమియం QLED డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అదే 65 అంగుళాల మోడల్ 4K డిస్‌ప్లేను కలిగి ఉంది. మెటాలిక్ డిజైన్‌ను కలిగి ఉంది.
60W ఆడియో అవుట్‌పుట్ :
కోడాక్ మ్యాట్రిక్ QLED సిరీస్ స్మార్ట్‌టీవీలు డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, DTS TruSurround టెక్నాలజీతో కూడిన నాలుగు స్పీకర్‌లను కలిగి ఉన్నాయి. ఈ స్పీకర్లు 60W అపుట్‌పుట్‌ను అందిస్తాయి. సినిమాలు సహా వెబ్ సిరీస్ సమయాల్లో మెరుగైన అనుభూతిని అందిస్తాయని కోడాక్ చెబుతోంది.
క్వాడ్ కోర్ ప్రాసెసర్ :
ఈ మ్యాట్రిక్స్ QLED టీవీలు క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఫలితంగా స్మూత్ ఫెర్ఫామెన్స్‌ను అందిస్తుందని కోడాక్ చెబుతోంది. ఈ టీవీ సిరీస్ యూట్యూబ్, జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ZEE5 వంటి అనేక యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా కలిగి ఉంటాయి.
కోడాక్ QLED టీవీ సిరీస్ ధర, సేల్ వివరాలు :
కోడాక్ QLED 43 అంగుళాల టీవీ ధర రూ.18,799 గా ఉంది. అదే 50 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.23,999, 55 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ రూ.27,649 గా ఉంది. 65 అంగుళాల వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్లు :
ఈ స్మార్ట్‌టీవీలను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ICICI, యాక్సెస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలను అందిస్తోంది. అమెజాన్‌లో SBI కార్డులపైనా 10 శాతం తగ్గింపును అందిస్తోంది.
రూ.16999 ప్రారంభ ధరకే :
ఈ డిస్కౌంట్‌లతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో కోడాక్ మ్యాట్రిక్స్ QLED టీవీలను రూ.16,999 కే కొనుగోలు చేయవచ్చు. పండుగ ఆఫర్ లో (Festival Bonanza) లో భాగంగా మూడు నెలలపాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








