ఇండియన్ బ్రాండ్ కుల్ట్ (Kult) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Kult Beyond పేరుతో అందుబాటులో ఉంటుంది. ధర రూ.6,999. ఆగష్టు 18 నుంచి అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది.
Read More : ఆగష్టు 24 నుంచి జియోఫోన్ బుకింగ్స్, మీకూ రిమైండర్ కావాలా..?
రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4G VoLTE సపోర్ట్, 13 ఎంపీ కెమెరా వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ Redmi 4, Moto C Plusలకు ప్రధాన కాంపిటీటర్‌గా నిలిచింది.
Kult Beyond ఫోన్ ప్రత్యేకతలు... 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 X 1280పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ క్వాడ్-కోర్ చిప్‌సెట్, మాలీ టీ720 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.1, మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్).
Read More : అద్బుతం.. చిన్న టేపులో 3,30,000 జీబీల డేటా
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.