రెడ్‌మి 4కు పోటీగా కల్ట్ గ్లాడియేటర్
ధర రూ.6,999. సెప్టంబర్ 24 నుంచి అమెజాన్ ఇండియాలో సేల్..
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Kult తన మూడవ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. కల్ట్ గ్లాడియేటర్ (Kult Gladiator) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.6,999. సెప్టంబర్ 24 నుంచి అమెజాన్ ఇండియాలో సేల్ ప్రారంభమవుతుంది.

ఫోన్ స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720× 1280పిక్సల్స్) విత్ 2.5 కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.25GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 చిప్‌సెట్,

ర్యామ్, స్టోరేజ్, కెమెరా,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్, లాంచ్ ఆఫర్స్
4000mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై జియో యూజర్లకు 20జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన 365 రోజుల్లోపు వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్‌ను ఉచితంగా పొందవచ్చు.


Click it and Unblock the Notifications