Home
Mobile

ఈ స్మార్ట్‌ఫోన్ పగలదు, తడవదు!

By Sivanjaneyulu Bommu

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ క్యోసెరా (Kyocera) తన డ్యురాఫోర్స్ సిరీస్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. DuraForce Pro పేరుతో లాంచ్ అయిన ఈ రగ్గుడ్‌ప్రూఫ్ ఫోన్ పటిష్టమైన డస్ట్, వాటర్ ఇంకా డ్రాప్ రెసిస్టెంట్ ఫీచర్లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ పగలదు, తడవదు!

Read More : E, 3G, H, H+, G..ఈ నెట్‌వర్క్ సిగ్నల్స్‌‌కు అర్థమేంటి..?

సూపర్ క్వాలిటీ వైడ్ వ్యూ యాక్షన్ కెమెరాతో వస్తోన్న ప్రపంచపు మొట్టమొదటి రగ్డుడ్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌గా DuraForce Pro గుర్తింపు తెచ్చుకుంది. ఐపీ68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ను కఠినమైన వాతావరణాల్లో సైతం ఉపయోగించుకోవచ్చు. మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ ఫోన్ ధర ట్యాగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఫోన్ ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

2 మీటర్ల లోతైన నీటిలో

2 మీటర్ల లోతైన నీటిలో

2 మీటర్ల లోతైన నీటిలో 30 నిమిషాల పాటు ఈ ఫోర్ సర్వైవ్ కాగలదు. షాక్, వైబ్రేషన్, లో ప్రెజర్, తేమ, ఫ్రీజింగ్, ఐసింగ్ రెయిన్, సోలార్ రేడియోషన్ వంటి ప్రమాదాలను తట్టుకునే విధంగా ఫోన్‌లో మిలటరీ స్టాండర్డ్ 810జీ ప్రూఫింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

13 మెగా పిక్సల్ మెయిన్ ఫేసింగ్ కెమెరా

13 మెగా పిక్సల్ మెయిన్ ఫేసింగ్ కెమెరా

DuraForce Pro స్మార్ట్‌ఫోన్‌ 13 మెగా పిక్సల్ మెయిన్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.

135 డిగ్రీ యాక్షన్ కెమెరా

135 డిగ్రీ యాక్షన్ కెమెరా

ఫోన్ వెనుక భాగంలో అదనంగా 135 డిగ్రీ యాక్షన్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా ద్వారా వీడియోలను 1080 పిక్సల్ క్వాలిటీలో స్లో మోషన్ లో రికార్డ్ చేసుకోవచ్చు.

అండర్ వాటర్ మోడ్

అండర్ వాటర్ మోడ్

అండర్ వాటర్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, స్లో మోషన్, టైమ్ - ల్యాప్స్ వంటి ప్రత్యేకమైన కెమెరా మోడ్స్‌తో పాటు కెమెరా ఫిల్టర్స్ ఇంకా యాప్స్ ఈ కెమెరాలో ఉన్నాయి.

గ్లవ్ అలానే వెట్ టచ్ స్ర్కీన్ ఆపరేషన్స్

గ్లవ్ అలానే వెట్ టచ్ స్ర్కీన్ ఆపరేషన్స్

ఈ రగ్గుడ్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ గ్లవ్ అలానే వెట్ టచ్ స్ర్కీన్ ఆపరేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. మీ చేతులు తడిగా ఉన్నప్పటికి టచ్ స్ర్కీన్ భేషుగ్గా స్పందిస్తుంది.

హార్డ్‌వేర్ స్పెక్స్

హార్డ్‌వేర్ స్పెక్స్

DuraForce Pro స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 3240 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 2.0 సపోర్ట్.

ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఫింగర్ ప్రింట్ సెన్సార్

DuraForce Pro స్మార్ట్‌ఫోన్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తోంది. పోన్ హోమ్ బటన్ భాగంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే..

ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లేను DuraForce Pro స్మార్ట్‌ఫోన్‌‌లో ఏర్పాటు చేసారు. ఫోన్ ప్యానల్ ఇంపాక్ట్ రెసిస్టెంట్ తత్వాన్ని కలిగి ఉండటం కారణంగా యాక్సిడెంటల్ డ్రాప్ లను సైతం సమర్థవంతంగా తట్టుకోగలదు.

Best Mobiles in India

English summary
Kyocera DuraForce Pro Announced: 6 Things to Know about World's First Rugged Action Camera Phone. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X