ఈ ఫోన్ మీ దగ్గరుంటే మీరు స్నానం చేసే సమయంలో కూడా దీంతో పనులు చేసుకోవచ్చు. సబ్బుతో ఈ ఫోన్ కి మీరు స్నానం కూడా చేయించవచ్చు. ఏందీ నమ్మలేకున్నారా..ఇది నిజం. వాటర్ ఫ్రూఫ్ పోన్లను వాడే జపాన్లో ఈ ఫోన్ అమ్మకానికి వచ్చింది. దీని ధర మన కరెన్సీలో 11, 690 రూపాయలు మాత్రమే.
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ , ఛాలెంజ్ చేస్తున్న ప్లాన్ ఇదే..
సరికొత్త స్మార్ట్ ఫోన్
సరికొత్త ఆవిష్కరణల దిశగా సాగిపోతున్న జపాన్లో శాస్త్రవేత్తలు ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించారు.
డిగ్నో రఫ్రీ
కేడీడీఐ అనే టెలికాం కంపెనీ డిగ్నో రఫ్రీ అనే పేరుతో ఓ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది వాటర్ ఫ్రూప్ ఫోన్. మీరు నీటిలో నానబెట్టినా కూడా ఈ ఫోన్ చెక్కు చెదరదు.
700సార్లు సోప్ పెట్టి కడిగేశారట
ఇప్పటికే అక్కడి డెవలపర్లు ఈ ఫోన్‌ని 700సార్లు సోప్ పెట్టి కడిగేశారట. అయినా ఫోన్ ఏ మాత్రం పాడవలేదు. సమర్ధవంతంగా పనిచేస్తుందని తెలిపారు.
ఈ ఫోన్ జపాన్లో మాత్రమే
ఇప్పుడు ఈ ఫోన్ అక్కడ అమ్మకానికి వచ్చింది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఫోన్లను అక్కడ ప్రవేశపెట్టారు. ఇతర దేశాల్లో ఈ ఫోన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
రఫ్రీ ఫోన్ ఫీచర్లు
5.0-inch HD TFT LCD , 720x1280 pixels
13 ఎంపీ కెమెరా , 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3,000mAh బ్యాటరీ
ఆండ్రాయిడ్ నౌగట్
2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 200 జిబి విస్తరణ సామర్ధ్యం
4జీ LTE, బరువు 158 గ్రాములు
Pale Pink, Clear White and Light Blue రంగుల్లో లభ్యం
Image source : FoneArena
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.