బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 ధర తగ్గింపు

|

కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ మార్కెట్లో నెలకున్న పోటీ కారణంగా ఆశించిన స్థాయిలో మార్కెట్‌ను చేయలేకపోతోంది. ఈ క్రమంలో ఇటీవల తన బీబీ10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్ ధరను అమాంతం తగ్గించేసింది.

 

బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై 8 అత్యుత్తమ డీల్స్!

సేల్స్‌ను మరింతగా పెంచుకునే లక్ష్యంతో బ్లాక్‌బెర్రీ మరో ధర తగ్గింపు ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ జెడ్ 30 పై రూ.5,000 ధర తగ్గింపును ప్రకటించి మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 ధర తగ్గింపు

తొలత, బ్లాక్‌బెర్రీ జెడ్ 30 స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను 2013, అక్టోబర్‌లో విడుదల చేసారు. అప్పటి అధికారిక ధర రూ.39,999. ప్రస్తుత ధర తగ్గింపు ఆఫర్‌లో భాగంగా ఈ అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.34,990కి సొంతం చేసుకోవచ్చు.

తాము ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి 10 సంవత్సరాలు కావస్తున్న నేపధ్యంలో ఈ డిస్కౌంట్ స్కీమ్‌ను అమలులోకి తీసుకువచ్చినట్లు బ్లాక్‌బెర్రీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ధర తగ్గింపు స్కీమ్ లిమిటెడ్ పిరియడ్ లో మాత్రమే అందబాటులో ఉంటుందని వారు వెల్లడించారు. ప్రకటించిన నాటి నుంచి ఈ ఆఫర్ 60 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బ్లాక్‌బెర్రీ జెడ్30 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఈ తాజా ఆఫర్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.

బ్లాక్‌బెర్రీ జెడ్30 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రో చిప్‌సెట్,
అడ్రినో 32 క్వాడ్‌కోర్ గ్రాఫిక్స్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (3ఎక్స్ డిజిటల్ జూమ్, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్),
2880ఎమ్ఏహెచ లై-ఐయోన్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 4.0, జీపీఎస్)

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X