రూ.600కే నోకియా 3310...
మార్కెట్లో నోకియా 3310 ధర కాస్తంత ఎక్కువుగా అనిపంచటంతో నోకియా అభిమానులు సైతం ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
కానిక్ నోకియా ఫీచర్ ఫోన్ Nokia 3310 ఇప్పుడు న్యూ లుక్‌లో దొరుకుతోన్న విషయం తెలిసిందే. నోకియా 3310 (2017) పేరుతో ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది. ధర రూ.3310. ధర కాస్త ఎక్కువుగా ఉండటంతో నోకియా అభిమానులు మాత్రమే ఈ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

క్లోన్ మోడల్స్ మార్కెట్లో విపరీతంగా పుట్టుకొస్తున్నాయి..
నోకియా 3310 మోడల్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకున్న నేపథ్యంలో ఈ ఫోన్‌కు క్లోన్ మోడల్స్ మార్కెట్లో విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. Darago 3310, Micromax X1i, VKWorld Z3310 పేర్లతో ఇప్పటికే కొన్ని క్లోన్ మోడల్స్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా ఈ జాబితాలోకి Lafee 3310
తాజాగా ఈ జాబితాలోకి మరో ఫోన్ చేరబోతోంది. దాని పేరే Lafee 3310. అచ్చం నోకియా 3301లాగా కనిపించే ఈ ఫోన్ ధర రూ.600 మాత్రమేనట. Lafee 3310 స్పెసిఫికేషన్స్...1.77 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, వీజీఏ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 16జీబి ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్ సపోర్ట్.

అమెజాన్ ఇండియాలో Micromax X1i
నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ నోకియా 3310కు పోటీగా మైక్రోమాక్స్ సరికొత్త ఫోన్‌ను రంగంలోకి దించింది. అచ్చం నోకియా 3310లానే రూపొందించబడిన ఈ ఫోన్ Micromax X1i పేరుతో అమెజాన్ ఇండియాలో దొరుకుతోంది. ధర రూ.1290

Micromax X స్పెసిఫికేషన్స్..
2.4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 320×240 పిక్సల్స్), ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్, వీజీఏ రేర్ ఫేసింగ్ కెమెరా, 32ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 1300mAh బ్యాటరీ విత్ 2జీ సపోర్ట్.

SOS emergency calling ఫీచర్,
SOS emergency calling ఫీచర్, ఈ ఫోన్‌కు మరో హైలైట్. కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ కాల్ వెళ్లిపోతుంది. ఎఫ్ఎమ్ రేడియో, ఆటో కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రోమాక్స్ ఈ ఫోన్‌లను 100 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీతో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications