లగ్జరీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, ధర వింటే షాకే !

Written By:

ఇటాలియన్‌ లగ్జరీ కారు తయారీదారు లంబోర్ఘిని మొబైల్ మార్కెట్ లోకి ప్రవేశించింది. కంపెనీ సరికొత్తగా సూపర్ లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆల్ఫా-వన్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

జియో యూజర్లు పండగ చేసుకునే వార్త

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర సుమారు 1.57 లక్షల రూపాయలు

దీని ధర సుమారు 1.57 లక్షల రూపాయలు. ఈ ధరల్లోనే వ్యాట్‌ ఛార్జీలు కూడా కలిసి ఉన్నాయి. అదనపు కస్టమ్స్‌ పన్నులను ఇక కొనుగోలుదారులే భరించాల్సి ఉంటుంది.

ఆల్ఫా-వన్‌

లంబోర్ఘిని సూపర్‌ కార్లలో వాడే డెంట్‌ రెసిస్టెంట్‌ లిక్విడ్‌ అలోయ్‌తో ఆల్ఫా-వన్‌ను ఇది రూపొందించింది. టైటానియం కంటే అలోయ్‌ ఎక్కువ మన్నికమైంది.

డిస్‌ప్లే

ఆల్ఫా వన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 820 ప్రాసెసర్‌ తో పాటు 5.5 అంగుళాల 2కే అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 2560x1440 పిక్సెల్‌ రెజుల్యూషన్‌

20మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా

4జీబీ ర్యామ్‌, 3జిబి ర్యామ్ అందుబాటులో ఉంటాయి. 20మెగాపిక్సెల్‌ వెనుక కెమెరాతో పాటు 8మెగాపిక్సెల్‌ ముందు కెమెరా ఉంటుంది. ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌

యూకే, యూఏఈలలో

ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ యూకే, యూఏఈలలో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చినట్టు అంతర్గత రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు.

దుబాయ్‌, లండన్‌ మాల్స్‌లో

దుబాయ్‌, లండన్‌ మాల్స్‌లో లగ్జరీ బొటిక్స్‌ బ్రాండ్స్‌ వద్ద కూడా ఇది లభించనుంది. ఈ ఫోన్‌తో పాటు ఇటాలియన్‌ లెదర్‌ స్లీవ్‌ ఫోన్‌ కేసు కూడా కొనుగోలుదారులకు వస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lamborghini's New Android Smartphone Revs Into Mobile Market, Priced at Rs 1.5 Lakh Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot