రూ.20 వేల ధరలో భారీ బ్యాటరీ బెస్ట్ ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. ఈ లిస్ట్ మీ కోసమే..!
Best Battery Smartphones : భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ జనవరిలోనూ ఈ ధర సెగ్మెంట్‌లో మరిన్ని ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఇటీవల అనేక సంస్థలు బడ్జెట్ ఫోన్‌లలోనూ భారీ బ్యాటరీలను అందించాయి. ప్రస్తుతం ఈ ధరలో భారీ భ్యాటరీ, మెరుగైన బ్యాటరీ పనితీరుతో అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ జాబితాలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన రియల్‌మి నార్జో 90 5G సిరీస్ (Realme Narzo 90 5G Series), మోటో G57 పవర్ 5G (Moto G57 Power 5G Smartphone), ఒప్పో K13 5G (Oppo K13 5G Smartphone) వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ 7000mAh బ్యాటరీతోపాటు మెరుగైన ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉన్నాయి.

రియల్‌మి నార్జో 90 5G సిరీస్ :
ఈ సిరీస్ గత నెలలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి నార్జో 90 5G, నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.13999 గా ఉంది. అదే నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.16999 గా ఉంది.
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
రియల్‌మి నార్జో 90 5G ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.57 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సర్, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

మోటో G57 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.14999 గా ఉంది. 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్ స్నా్ప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఇన్ 1 లైట్ సెన్సర్, 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.19999 గా ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 5700mm Sq భారీ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.
ఈ ఒప్పో ఫోన్ 80W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫుల్ ఛార్జింగ్‌ను కేవలం 56 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని ఒప్పో విడుదల సమయంలో తెలిపింది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








