Budget Smartphones : రూ.15 వేల ధరలో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. లిస్ట్ ఇదిగో..!
Smartphones under 15k : భారత్ మార్కెట్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ ఉంటోంది. అందువల్ల అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు రూ.15 వేల ధర సెగ్మెంట్‌లో హ్యాండ్‌సెట్స్‌ను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ జాబితాలో వివో T4x 5G, శాంసంగ్ గెలాక్సీ F16 5G, ఒప్పో K13x 5G, రియల్‌మి P3x 5G, పోకో M7 ప్రో మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
* వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది. ప్రాంటో పర్పుల్, మెరీన్ బ్లూ రెండు కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 2MP బొకేష్ కెమెరాలతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
* రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3X 5G ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లర్ పింక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

* శాంసంగ్ గెలాక్సీ M16 5G :
శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉంది. బ్లష్ గ్రీన్, మింట్ గ్రీన్, థండర్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS పైన పనిచేస్తోంది. 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

* ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఈ ఫోన్ సన్‌సెట్ పీచ్, మిడ్‌నైట్ వైలెట్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే తో అందుబాటులోకి వచ్చింది. 6nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తోపాటు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.
* పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ లావెండర్ ప్రోస్ట్, లూనార్ డస్ట్, ఓలివ్ ట్విలైట్ కలర్స్‌లో లభిస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా ఈ పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ LYT 600 కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను అమర్చారు.


Click it and Unblock the Notifications








