Home
Mobile

రూ.15000 కంటే తక్కువ ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్‌, స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు..!

భారత్‌ మార్కెట్‌లో బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్‌లకు భారీ డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా రూ.15 వేల ధర హ్యాండ్‌సెట్‌లకు మరీ డిమాండ్‌ ఉంది. ఇటీవల కాలంలో ఈ ధరలో అనేక ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఈ సెగ్మెంట్‌ లోనూ 50MP ప్రైమరీ కెమెరాలు సహా కనీసం 5000mAh బ్యాటరీ తో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ జాబితాలో (5G Smartphones Under Rs15000) శాంసంగ్ గెలాక్సీ F16 5G, రియల్‌మి నార్జో 80x 5G, ఇన్ఫినిక్స్ నోట్‌ 50X 5G ఫోన్‌లు ఉన్నాయి.

* శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F16 5G Smartphone) 6.7 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్‌, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

Latest Best 3 5G Smartphones under Rs15000 in india

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కోసం 6 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని శాంసంగ్‌ తెలిపింది. 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 6GB ‌ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌ లో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1.5TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా వైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. మరియు 25W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.13499 గా ఉంది. వైబింగ్ బ్లూ, బ్లింగ్‌ బ్లాక్‌, గ్లా్‌మ్‌ గ్రీన్‌ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ ఫోన్‌ 11 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుంది.

* రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ :
రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 80X 5G Smartphone) 6.72 అంగుళాల FHD+ ఫ్లా్ట్‌ LCD డిస్‌ప్లేతో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 690 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

ఈ రియల్‌మి ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు రియర్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సన్‌లిట్‌ గోల్డ్‌, డీప్‌ ఓసియన్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

* ఇన్ఫినిక్స్ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 672 గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్రీన్‌ కలర్‌ వేరియంట్ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ మరియు పర్పుల్‌, గ్రే కలర్‌ వేరియంట్స్‌ మెటాలిక్‌ ఫినిష్‌ను కలిగి ఉన్నాయి. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్ (Infinix Note 50X 5G Smartphone) మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15 ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తుందని సంస్థ హామీ ఇచ్చింది. ఈ OS ద్వారా గేమ్‌ మోడ్, కిడ్స్‌ మోడ్‌, డైనమిక్ బార్‌, ఫ్లోరెక్స్‌ స్మార్ట్‌ అసిస్టెంట్‌ వంటి అనేక ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు సర్కిల్‌ టూ సెర్చ్‌, రైటింగ్ అసిస్టెంట్‌, AI వాల్‌పేపర్‌ జనరేటర్‌, డాక్యుమెంట్ అసిస్టెంట్‌, AI నోట్‌, పొర్ట్రెయిట్‌ మోడ్‌, కాల్‌ అసిస్టెంట్‌, సోషల్‌ అసిస్టెంట్‌, AI Eraser, AI Cut out వంటి ఫీచర్‌లున్నాయి.

ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ డ్యూయర్ రియర్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. LED ఫ్లాష్‌ లైట్‌తోపాటు యాక్టివ్‌ హాలో లైటింగ్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్‌ వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. IR బ్లాస్టర్‌ తోపాటు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఇన్ఫినిక్స్ నోట్‌ 50X 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది.

Best Mobiles in India

English summary
Latest Best 3 5G Smartphones under Rs15000 in india here is the list and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X