Home
Mobile

రూ.15 వేల ధరలో మంచి 5G స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా.. టాప్‌ 3 ఫోన్‌ల వివరాలు ఇవిగో..!

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. భారీగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఉన్న భారత్‌లో ప్రతి నెల అనేక బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. అత్యధికంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశంలో బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్‌లకు భారీగా డిమాండ్‌ ఉంది. అంటే రూ.15,000 రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు (Best 5G Smartphones Under Rs15000) డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఈ కథనంలో రూ.15 వేల ధరలో ఇటీవల విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు మీకోసం.

ఇటీవల భారత్‌ మార్కెట్‌లో అనేక రూ.15000 ధరలో అనేక ఫోన్‌లు విడుదల అయ్యాయి. అయితే పనితీరు, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల ఆధారంగా కొన్ని ఫోన్లు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో రియల్‌మి P3 5G, పోకో M7 ప్రో 5G, ఇన్ఫినిక్స్‌ నోట్ 50x 5G ఫోన్‌లు ఉన్నాయి.

Latest best 3 5G smartphones under Rs15000 price

రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ :
ఇటీవల కాలంలో రియల్‌మి అనేక మోడల్స్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా రియల్‌మి P3 సిరీస్‌ భాగంగా నాలుగు ఫోన్లు విడుదల అయ్యాయి. ఇందులో రియల్‌మి P3 5G హ్యాండ్‌సెట్ (Realme P3 5G)అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ రూ.15 వేల ధర సెగ్మెంట్‌లో బెస్ట్‌ హ్యాండ్‌సెట్‌గా ఉంది.

రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ProXDR సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ IP66 + IP68 + IP69 రేటింగ్‌తో బెస్ట్ వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

రియల్‌మి బడ్జెట్‌ ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 2 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని రియల్‌మి తెలిపింది.

ఈ ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

రియల్‌మి P3 5G హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. విడుదల సమయం, ఇటీవల జరిగిన సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉండేవి. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఇన్ఫినిక్స్ ఇటీవల కాలంలో ఆకట్టుకొనే డిజైన్‌, అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతో ఇన్ఫినిక్స్ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రూ.15 వేల బడ్జెట్‌లో బెస్ట్‌ హ్యాండ్‌సెట్‌గా ఉంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 672 గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ (Infinix Note 50x 5G) మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ OS ద్వారా డైనమిక్ బార్‌, గేమ్‌ మోడ్‌, కిడ్స్‌ మోడ్‌, పీక్‌ ప్రూఫ్‌ ఫ్లోటింగ్ విండో, ఫ్లోరెక్స్ స్మార్ట్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్‌లు అందుబాటులోకి వస్తాయి. AI నోట్‌, AI Eraser, AI Cut out, AI వాల్‌పేపర్‌ జనరేటర్‌, రైటింగ్‌ అసిస్టెంట్‌, డాక్యుమెంట్ అసిస్టెంట్, కాల్‌ అసిస్టెంట్‌, సోషల్‌ అసిస్టెంట్‌, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు ఉన్నాయి.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, డెప్త్‌ సెన్సార్‌తోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. LED ఫ్లాష్‌ లైట్‌, యాక్టివ్‌ హాలో లైటింగ్‌ను ఫీచర్‌లు కూడా ఉన్నాయి. 45W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 10W రివర్స్‌ వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh సెమీ సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీని కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్‌ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.12999 గా ఉంది. ఈ ఫోన్‌ టైటానియం గ్రే, సీ బ్రీజ్‌ గ్రీన్‌, ఎన్‌ఛాంటెడ్‌ పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది. గ్రీన్‌ కలర్‌ వేరియంట్ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌, మిగిలిన రెండు కలర్‌ వేరియంట్స్‌ మెటాలిక్ ఫినిష్‌ను కలిగి ఉంటాయి.

పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ :
పోకో M7 ప్రో 5G హ్యాండ్‌సెట్‌ (Poco M7 Pro 5G) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ (1080*2400 పిక్సల్స్‌) సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2100 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ పోకో ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆం‌డ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ పోకో ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 50MP సోనీ LYT 600 కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP కెమెరాను అమర్చారు. బడ్జెట్‌ ధరలో బెస్ట్‌ కెమెరాలు కలిగిన ఫోన్‌గా ఉంది.

పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర ప్రస్తుతం రూ.13749 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15749 గా ఉంది. ఈ ఫోన్‌ లావెండర్‌ ప్రోస్ట్‌, లూనార్‌ డస్ట్‌ మరియు ఓలివ్‌ ట్విలైట్‌ వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Latest best 3 5G smartphones under Rs15000 price in india here is the list features specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X