Home
Mobile

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్.. రూ.10 వేల ధరలో బెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌లు..!

Amazon Great Freedom Festival 2025 : అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ 2025 సేల్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్ పై డిస్కౌంట్‌లను అందిస్తోంది. దీంతోపాటు SBI బ్యాంకు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేల్‌లో రూ.10 వేల ధరలో అనేక హ్యాండ్‌సెట్స్‌ ఉన్నాయి. ఈ జాబితాలో శాంసంగ్‌ గెలాక్సీ M06 5G, లావా బ్లేజ్ డ్రాగన్‌, ఐకూ Z10 లైట్ 5G ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌ :
శాంసంగ్‌ నుంచి ఈ సంవత్సరమే ఈ హ్యాండ్‌సెట్‌ (Samsung Galaxy M06 5G Smartphone) విడుదల అయింది. రూ.10 వేల రేంజ్‌లో మంచి హ్యాండ్‌సెట్‌గా ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

galaxy m06 5g

ఈ శాంసంగ్ బడ్జెట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌, 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో లేదు. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.8749, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10049 గా ఉంది. ఈ వేరియంట్స్‌పై రూ.250 డిస్కౌంట్‌ను అందిస్తోంది. బ్లేజింగ్ బ్లాక్‌, సేజ్‌ గ్రీన్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

galaxy m06 5g

లావా బ్లేజ్‌ డ్రాగన్ 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (Lava Blaze Dragon 5G Smartphone) గత నెలలోనే అందుబాటులోకి వచ్చింది. డిజైన్‌ పరంగా ఈ ఫోన్‌ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర రూ.9999 గా ఉంది. SBI బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై రూ.1000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. గోల్డ్‌ మిస్ట్‌, మిడ్‌నైట్ మిస్ట్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత క్లీన్ OS పైన పనిచేస్తోంది. ఈ లావా హ్యాండ్‌సెట్ 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 50MP AI కెమెరా, 8MP కెమెరాను కలిగి ఉంది.

galaxy m06 5g

ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ జూన్‌ నెలలోనే అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చినా, బెస్ట్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ (iQOO Z10 Lite 5G Smartphone) ప్రారంభ ధర రూ.9998 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. సైబర్‌ గ్రీన్‌, టైటానియం బ్లూ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Take a Poll

ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. 50MP సోనీ AI కెమెరా, 2MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Latest Best 5G smartphones under rs10000 on Amazon Great Freedom Festival 2025 sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X