Smartphones Under 10k : రూ.10 వేల ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ ఫోన్‌లు మీకోసమే..!
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఫోన్‌లకు భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు రూ.10 వేల కంటే తక్కువ ధరలో ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల భారత్ మార్కెట్‌లో ఈ ధరలో అనేక ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు.
ప్రస్తుతం రూ.10 వేల కంటే తక్కువ ధరలో (Smartphones Under 10k శాంసంగ్ గెలాక్సీ M06 5G, ఏసర్ సూపర్ ZX 5G, పోకో M7 5G, రెడ్‌మి 14c 5G, ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. విడుదల ధరతో పోలిస్తే ఈ మోడల్స్ ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చాయి.

శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M06 5G) 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 S0C చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.7999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.8499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.9799 గా ఉంది.

ఏసర్ సూపర్ ZX 5G :
ఏసర్ సూపర్ ZX 5G ఫోన్ (Acer Super ZX 5G) 6.78 అంగుళాల అల్ట్రా బ్రైట్ FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ సెన్సార్‌లను కలిగి ఉంది. 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999 గా ఉంది.

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (Poco M7 5G) 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ను కూడా కలిగి ఉంది. వీటితోపాటు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.10499 గా ఉంది.

రెడ్‌మి 14c 5G స్మార్ట్‌ఫోన్ :
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ (Redmi 14C 5G) 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.9499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10499, 6GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5G :
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ (Infinix Hot 50 5G) 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 Soc చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14.5 OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా 48MP సోనీ IMX582 ప్రైమరీ కెమెరా, AI డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. అమర్చి ఉంటుంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది.


Click it and Unblock the Notifications








