Home
Mobile

మంచి కెమెరాల ఫోన్‌ కోసం చూస్తున్నారా.. 108MP కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకోండి..!

108MP Camera Phones 2025 : భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం 108MP కెమెరాలో హానర్‌, ఇన్ఫినిక్స్ సంస్థలు తమ ఫోన్‌లను విడుదల చేశాయి. హానర్‌ x9c 5G ఫోన్‌ జులై నెలలో అందుబాటులోకి రాగా.. ఇన్ఫినిక్స్ GT 30 ప్రో మోడల్‌ జూన్‌ నెలలో అందుబాటులోకి వచ్చింది. పోకో M6 ప్లస్‌ 5G, రెడ్‌మి 13 5G కూడా 108MP కెమెరాను కలిగి ఉంది. ఈ సంవత్సరం విడుదల అయిన హానర్‌, ఇన్ఫినిక్స్ మోడ‌ల్స్‌ ధర, స్పెసిఫికేషన్‌ల పూర్తి వివరాలు.

ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (infinix GT 30 Pro Smartphone) భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26999 గా ఉంది. ఈ ఫోన్‌లో 108MP కెమెరాతోపాటు గేమింగ్‌ కోసం ప్రత్యేక ఫీచర్లున్నాయి.

infinix gt 30 pro

ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 13MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.

ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు Always On Display ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ TUV Rheinland Low బ్లూ లైట్‌, ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 4nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్టిమేట్‌ SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 14 పైన పనిచేస్తోంది. XBoost గేమింగ్‌ ఇంజిన్‌, ఇ-స్పోర్ట్స్‌ మోడ్‌, AI ఆధారిత VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W వైర్‌, 30W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతోపాటు 10W వైర్‌, 5W వైర్‌లెస్‌ రివర్స్‌ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది.

infinix gt 30 pro

హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్‌ :
హానర్ సంస్థ ఈ సంవత్సరం జులైలో 108MP కెమెరా, 6600mAh భారీ బ్యాటరీతో హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్‌ను (Honor X9c 5G Smartphone) లాంచ్‌ చేసింది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది.

ఈ ధరలో ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 3x జూమ్‌తో 108MP ప్రైమరీ కెమెరా, 5MP వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

infinix gt 30 pro

హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ 6.78 అంగుళాల 1.5K కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫ్లిక్కర్‌ ఫ్రీ, Low Blue లైట్‌ TUV Rheninland సర్టిఫికేషన్‌, SGS డ్రాప్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP65M డస్ట్‌ మరియు 360 డిగ్రీ వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తోంది. AI Motion Sensing, AI Erase, AI Deepfake Detection, AI Magix Capsule, AI Magic Portal 2.0 ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6600mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
latest best smartphones with 108MP Camera in 2025 here is the list and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X